టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఐదు వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకుని తన ఇద్దరు భార్యలతో ఫ్యామిలీ లైఫ్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎప్పుడూ కూడా ఎన్టీఆర్‌కు ఏ హీరోయిన్‌తో కూడా ఎఫైర్ ఉందనో లేదా మరో సంబంధం ఉందనో వార్త మాత్రం రాలేదు. అయితే ఒక్క హీరోయిన్ విషయంలోనూ ఎన్టీఆర్ ఇలా వార్తల్లోకి ఎక్కాడు. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమీరారెడ్డి. ఎన్టీఆర్ – సమీరారెడ్డి కాంబినేషన్లో అశోక్, నరసింహుడు రెండు సినిమాలు వచ్చాయి.
ముందుగా నరసింహుడు సినిమా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చి ప్లాప్ అయ్యింది. తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అశోక్ సినిమాలో కూడా మరోసారి సమీరను రిపీట్ చేశారు. ఆ సమయంలో సమీరతో కాస్త క్లోజ్‌గా ఉండడంతో పాటు ఆమెను రిపీట్ చేయడంతో ఎన్టీఆర్ – సమీరకు మధ్య ఏదో ఉందన్న పుకార్లు బయటకు వచ్చాయి.
ఎన్టీఆర్ ఆమెకు ఓ లగ్జరీ కారు కొనిచ్చాడని.. ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో ఓ ప్రచారం అయితే జరిగింది. అయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండే ఎన్టీఆర్ తమ కుటుంబ పెద్దలు చూసిన సంబంధం అయిన లక్ష్మీప్రణతినే పెళ్లి చేసుకున్నాడు.