మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మాటలు పదునైన తూటాల్లా పేలుతూ ఉంటాయి. త్రివిక్రమ్ డైలాగులే ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేశాయి. అలాగే ఆయన మాటలే ఎంతో మందిని స్టార్ హీరోలను చేశాయి. హీరోలను స్టార్లను చేసి.. హిట్ కోసం వెయిట్ చేస్తోన్న వారికి సూపర్ హిట్లు ఇచ్చిన ఘనత ఖచ్చితంగా త్రివిక్రమ్‌కే దక్కుతుంది.
త్రివిక్రమ్ కథలు, డైలాగులు తెలుగు ప్రేక్షకుల మదిలో అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అల వైకుంఠఫురం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ ఇమేజ్ డబుల్ అయిపోయింది. ఈ సినిమాకు ఆయనకు రు. 25 కోట్ల రెమ్యునరేషన్ మొత్తంగా ముట్టిందని చెపుతూ ఉంటారు. ముందు కొంత రెమ్యునరేషన్‌తో పాటు తర్వాత లాభాల్లో వాటా కూడా ఉందట. టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది ఖచ్చితంగా త్రివిక్రమే అని చెప్పాలి.
మరి త్రివిక్రమ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా కూడా ఆయన ఈ స్థాయికి ఎలా ? వచ్చాడు ? ఆయన తొలి రెమ్యునరేషన్ ఎంత ? అన్నది చూస్తే ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఇండస్ట్రీలోకి రాకముందు లెక్చరర్‌గా పనిచేసిన త్రివిక్రమ్ 1998లో ఇండస్ట్రీలోకి వచ్చాడు. స్రవంతి రవికిషోర్ – రామోజీరావు కలిసి నిర్మించిన సినిమాలతోనే ఆయన వెలుగులోకి వచ్చాడు. ఆయన మొదట సినిమాలకు రు. 2 – 3 వేలు మాత్రమే తీసుకునేవాడట.
ఇక త్రివిక్రమ్, సునీల్, ఆర్పీ పట్నాయక్ ఈ ముగ్గురు కూడా రూమ్‌మెట్స్‌గా ఉంటూ సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేసేవారట. అప్పట్లో వీరు ఎంత తక్కువ రెమ్యునరేషన్ ఉన్నా కూడా సరిపెట్టుకునేవారట. ఆ త్రివిక్రమ్ ఈ రోజు రు. 25కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగారు.