సౌత్ ఇండియాలో నయనతార పేరు తెలియని వారుండరు. ఆమె యాక్టింగ్ కు బడా హీరోలు సైతం ఫిదా అయ్యారు. ఆ అందం, ఆ అభినయం రెండితో సీనీ ఇండస్ట్రీను ఏలేస్తుందనే చెప్పాలి. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బడా సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు లవర్ విగ్నేష్ తో పెళ్లి పీఠలు ఎక్కడానికి కూడా రెడీ అవుతుంది. అయినా కానీ ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అమ్మడు క్రేజ్ అలాంటిది ఏం చేద్దాం.
ఈ క్రమంలోనే ఆమెకు మెగాస్టార్ పక్కన నటించే ఛాన్స్ వచ్చింది. నిజానికి ఈమె ఇదివరకే చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అనుకున్నంత హిట్ అందుకోలేకపోయింది. ఇక చిరంజీవి రీమేక్ చేస్తున్న లూసీఫర్ సినిమా తెలుగు రీమేక్ లో గాడ్ ఫాదర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నయంతార చిరంజీవికి చెల్లెలుగా నటించబోతుంది. ఒరిజినల్ వెర్షన్లో మంజువారియర్ పోషించిన పాత్రలో నయనతార కనిపించనుంది. అయితే మంజువారియర్ భర్తగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించాడు.
ఇక వివేక్ ఒబెరాయ్ పాత్రలో తెలుగులో సత్యదేవ్ ను సెలక్ట్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో నయన్ కొంత నిరాశ చెందుతున్నత్లు తెలుస్తుంది. అందుకే డైరెక్టర్ కి స్పెషల్ రిక్వెస్ట్ మీదా ఆ పాత్రను కన్నడ యాక్టర్ సుదీప్ కు ఇవ్వాళని అడిగిందట. లేకపోతే వేరే ఎవరైన తమిళ హీరోని ఆ పాత్రలో పెట్టండి అంటూ నయన్ కోరిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సినీ ఇండస్తృఈలో హాట్ టాపిక్ నడుస్తుంది. ఇక దీని పై నెటిజన్స్ కూడా భిన్నంగా కౌంటర్ లు ఇస్తున్నారు. నయన్ డామినేషన్ మళ్లీ మొదలైందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.