పెళ్లికి ముందే సినిమా వాళ్లు సహజీవనాలు చేయడాలు.. శారీరకంగా కలుసుకోవడాలు కామన్ అయిపోయాయి. పెళ్లయ్యాక వీరి మధ్య చాలా త్వరగానే స్పర్థలు కూడా వస్తున్నాయి. చాలా తక్కువ మంది మాత్రమే అన్ని విషయాల్లోనూ సర్దుబాటు చేసుకుంటూ వెళుతున్నారే తప్పా ఎక్కువ మంది మాత్రం కలహాలతో విడిపోతున్నారు. తాజాగా ఓ బుల్లితెర నటి తనపై పెళ్లికి ముందే తన భర్త ఏకంగా ఆరుసార్లు లైంగీక దాడి చేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది.
ఈ క్రమంలోనే ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా సంచలనంగా మారింది. కర్నాకటలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వాల్లిద్దరు కూడా బుల్లితెర నటులే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వారికి ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తాను ఆమెకు ఛాన్సులు ఇప్పిస్తానని నమ్మించి పెళ్లికి ముందే శారీరకంగా లొంగదీసుకుని వాడుకున్నాడు.
ఆమె బలవంతం చేయడంతో ఎట్టకేలకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే అత్తింటికి వెళ్లిన వెంటనే ఆమెకు టార్చర్ స్టార్ట్ అయ్యింది. కట్నం తేవాలని వేధిస్తున్నారు. చివరకు కులం పేరుతో కూడా తిడుతున్నారు. ఆమెను ఎలాగైనా విడిపించు కోవాలని విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. దీంతో మానసిక వేదనతో ఆ నటి ఆసుపత్రి పాలైంది. ఈ క్రమంలోనే విసిగి పోయి తన భర్త, అత్త మామల వేధింపులతో పాటు పెళ్లికి ముందు తన భర్తపై తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టింది. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.