ప్రియాంక..ఈ పేరు ఒక్కప్పుడు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు కోట్లది ప్రజల మంది ఆమె పేరును పలుకుతున్నారు. అందుకు కారణం బిగ్ బాస్. తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్‌లో ఒక్కరికిగా హౌస్ లోఖి వెళ్లిన ప్రియాంక.. బాగా సెటిల్డ్‌గా ఆడుతూ.. ప్రేక్షక ఆదరణతో మంచి మెజారిటీతో దూసుకుని పోతుంది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతీ సీజన్లో ప్రేక్షకులను అలరించడానికి ఒక ప్రేమజంట కచ్చితంగా ఉంటుంది. అయితే ఈసారి బిగ్ బాస్‌లో ..అలాంటి ప్రేమజంట ఎవ్వరు లేకపోవడం గమనార్హం
అయితే హౌస్ లో వన్ సైద్ లవ్ స్టోరీ ఒక్కటి నడుస్తుంది. యస్..బిగ్ బాస్ రోజూ చూస్తున్నవారికి ఈ విష్యం అర్ధమైయే ఉంటుంది. ప్రియాంక..మానస్ ని ఇష్టపడుతున్నట్లు ఆ షో చూస్తే తెలుస్తుంది. పింకీ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి దాదాపు అందరు హౌస్‌మేట్స్‌ను అన్నయ్య అని పిలుస్తూ వారికి దగ్గరయిపోతుంది. కానీ మొదటి నుండి మానస్‌ను మాత్రమే అలా పిలవకలేకపోతుంది. స్టార్టింగ్ నుండి మానస్‌పై ఇష్టాన్ని పెంచుకున్న పింకీ మెల్లమెల్లగా తనకు చాలా దగ్గరయిపోయింది. ప్రియాంక రోజురోజుకీ అతడి మీద ప్రేమను పెంచుకుంటూ, అతడి గురించే ఆలోచిస్తూ కాలం గడిపేస్తోంది.
ఇదిలా ఉండగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మానస్ తల్లి పద్మిని ప్రియాంక సింగ్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక చాలా మంచి అమ్మాయి అని, తనంటే చాలా ఇష్టమని బిగ్‌బాస్ అనేది 110 రోజుల ఆట మాత్రమే. ఈ షోలో ఎంతమంది జంటలు బయటకొచ్చారు? ఎంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు? ఏదైనా బిగ్‌బాస్ షో వరకే అని అందులో ఉన్న కంటెస్టెంట్లకు బాగా తెలుసు. అలా హౌస్‌లో ఉన్నంత వరకు ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉండడం కామన్ అన్నారు. అంతే కాని బిగ్ బాస్‌లో ప్రేమల గురించి తనకు నమ్మకం లేదన్నారు. ఏదైనా షో వరకే అని తేల్చి చెప్పారు. మానస్ పెళ్లి గురించి కూడా మనసులో మాట బయటపెట్టారు పద్మిని. నేను ఎవర్ని వేలు పెట్టి చూపిస్తే మానస్ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ప్రియాంక సింగ్.. నా కొడుకును పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఒప్పుకోను. ఆమెను తగిన అబ్బాయిని చూపించి పెళ్లి చేస్తా.. ఏదైనా సాయం చేస్తాను అని చెప్పింది.