లోకనాయకుడుగా ప్రసిద్ధి కెక్కిన సీనియర్ హీరో కమల్‌హాసన్ ఏం చేసినా ఓ సంచలనమే. ఆయన సినిమాలు, నటనా పరంగా ఎంత టాప్ అయినా కూడా వ్యక్తిగత, వైవాహిక జీవితంలో మాత్రం తరచూ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ముందుగా వాణీ గణపతిని పెళ్లి చేసుకున్న కమల్ ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి సారికను పెళ్లి చేసుకున్నారు. శృతీహాసన్, అక్షరహాసన్ పుట్టాక ఆమెకూ విడాకులు ఇచ్చాడు. తర్వాత సీనియర్ హీరోయిన్ గౌతమితో కొన్నేళ్లు సహజీవనం చేసి ఆ తర్వాత ఆమెతోనూ తెంచేసుకున్నారు.
కమల్ తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడిలో 1954 నవంబర్ 7న పుట్టారు. ఆయన చిన్న వయస్సులోనే జాతీయ అవార్డు అందుకున్నారు. కమల్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు.. ఆయన ఓ నిర్మాత.. ఓ దర్శకుడు కూడా..! కమల్ హీరో కాక ముందు భారతీయ సంప్రదాయ నృత్యాలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత ఫైట్ మాస్టర్‌గా కూడా పనిచేశారు. మళయాళ సినిమా కన్యాకుమారి ద్వారా కమల్ తొలి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. భారతీయ సినిమా ఎప్పటకి గర్వించదగ్గ హీరోగా నిలిచిపోయాడు.
కమల్‌కు ఇప్పటి వరకు 19 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 4 జాతీయ అవార్డులు దక్కాయి. కమల్‌కు 1990లో పద్మ శ్రీ, 2014లో పద్మభూషన్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. కమల్ గత ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసినప్పుడు తనకు 176.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పారు. ఆ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి వనతీ శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు.
కమల్ అఫిడవిట్‌లో చూపించిన ఆస్తులు ఇవి కాగా.. ఆయన ఇతర స్థిర, చర ఆస్తులతో పాటు కూతుళ్లు ఇద్దరి పేరుతో ఉన్న ఆస్తుల విలువ చూస్తే అది వేల కోట్లలోనే ఉంటుందని టాక్ ?