సినిమా ఇండస్ట్రీలో సీనియర్ అందాల తార టబు గురించి చెప్పక్కర్లేదు. ఆమె అక్క ఫరా సినిమా వారసత్వాన్ని అంది పుచ్చుకున్న టబు చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. టబుది హైదరాబాదీ బేస్డ్ ముస్లీం కుటుంబం. ఆమె పుట్టింది కూడా హైదరాబాద్‌లోనే..! బాలీవుడ్‌లో వరుస పెట్టి హిట్లు కొట్టిన ఆమె ఆ తర్వాత తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగులో ప్రేమదేశం సినిమాతో పాటు నాగార్జున పక్కన నిన్నే పెళ్లాడతా సినిమా చేసింది.
టబు వయస్సు పైబడ్డాక కేవలం హీరోయిన్ పాత్రలే కాదు.. వ్యాంప్ పాత్రలు చేసి కూడా ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఇక టబు వయస్సు ఇప్పటికే 50 ఏళ్లు దాటేసింది. ఇప్పటకీ ఆమె పెళ్లి చేసుకోలేదు. ఇటీవల అల వైకుంఠపురములో సినిమాలో చేసిన క్యారెక్టర్‌తో ఆమె మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. టబు వయస్సు పెరిగినా ఆమె వన్నె మాత్రం తగ్గలేదు.
ఇక టబు టాలీవుడ్‌కు చెందిన ఓ టాప్ హీరోతో అప్పట్లో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని చెపుతారు. అతడి వల్లే ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిందని అంటారు. ఇదిలా ఉంటే తాజాగా టబు తాను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం బాలీవుడ్ టాప్ హీరో అజయ్ దేవగణ్ కారణం అని చెప్పింది.
టబు సోదరుడు సమీర్ పక్కనే అజయ్ దేవగణ్ ఉండేవాడట. టబుతో ఎవరైనా మాట్లాడితే అస్సలు తట్టుకోలేకపోయేవాడట అజయ్. అయితే అజయ్ ఇప్పటికి అయినా నా మనస్సును అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నా.. అని ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. అజయ్‌తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో టబు ఆ మాట అన్నా కూడా టబు మాత్రం తెలుగు అగ్ర హీరో తో ప్రేమ వల్లే ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదని అంటారు.