Moviesస‌మంత రెమ్యున‌రేష‌న్ పెంపు వెన‌క ఇంత టాప్ సీక్రెట్ ఉందా..!

స‌మంత రెమ్యున‌రేష‌న్ పెంపు వెన‌క ఇంత టాప్ సీక్రెట్ ఉందా..!

అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత మ‌ళ్లీ సినిమాల‌పై పూర్తిగా ఫోక‌స్ చేసింది. ఒక్క‌సారిగా స్పీడ్ పెంచేస్తోంది. ఒక‌టి రెండు వారాల వ్య‌వ‌ధిలో రెండు సినిమాలు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌లు కూడా వ‌చ్చేశాయి. ఇక స‌మంత తెలుగులో మాత్ర‌మే కాదు.. అటు త‌మిళ్‌లో కూడా సినిమాలు చేస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తోన్న స‌మంత‌.. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్లో కూడా మ‌రో సినిమా చేస్తోంది.

ఇక తెలుగులో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న సినిమాలో సైతం ఆమె న‌టిస్తోంది. ఈ సినిమాకు ద‌స‌రా అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నార‌ట‌. ఈ సినిమాకు ఏరీ కోరి మ‌రీ స‌మంత‌నే కావాల‌ని ఎంపిక చేశార‌ట‌. అయితే స‌మంత ఈ సినిమాకు త‌న రెమ్యున‌రేష‌న్ కూడా పెంచేశార‌ని తెలుస్తోంది. జీఎస్టీ మిన‌హాయించి మ‌రీ రు. 3 కోట్లు అడిగింద‌ట సామ్‌. అయినా కూడా నిర్మాత‌లు ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకున్న‌ట్టు టాక్ ?

స‌మంత‌కు పెళ్ల‌య్యి.. ఇప్పుడు విడాకులు తీసుకున్నా కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. మ‌రి ఈ ఫామ్‌ను స‌మంత ఎన్నేళ్లు కంటిన్యూ చేస్తుందో కాని .. ఆమె ఇక‌పై సైన్ చేసే ప్ర‌తి సినిమాకు రెమ్యున‌రేష‌న్ ఇదే రేంజ్‌లో ఉండ‌బోతోంద‌ట‌. ప్ర‌స్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ల రెమ్యున‌రేష‌న్లే రు 1.5 నుంచి రు. 2 కోట్ల రేంజ్‌లో ఉంటాయి. పూజా హెగ్డే, ర‌ష్మిక రెమ్యున‌రేష‌న్లు మించి మ‌రీ స‌మంత డిమాండ్లు ఉన్నాయి. ఇక స‌మంత ఇలా రేట్లు పెంచ‌డం వెన‌క ఆమె బాలీవుడ్ సినిమాల‌కు వెళ్లే ఆలోచ‌న‌లో ఉంద‌ని.. అందుకే ఇప్పుడు మెట్టు దిగ‌డం లేద‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news