Moviesస‌మంత హ‌ద్దులు చెరిపేసుకుందా...!

స‌మంత హ‌ద్దులు చెరిపేసుకుందా…!

అక్కినేని హీరో నాగచైతన్యతో నాలుగేళ్ళ వైవాహిక బంధాన్ని తెంచుకున్న‌ సమంత ఇప్పుడు కెరీర్ విషయంలో స్పీడ్‌గా ముందుకు వెళుతోంది. వ‌రుస‌గా తెలుగు సినిమాల్లో నటించేందుకు సంతకాలు చేస్తోంది. ప్రస్తుతం గుణశేఖర్ శాకుంత‌లం సినిమాలో నటిస్తున్న సమంత బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప‌ సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో సినిమాలో కూడా ఆమె ఐటమ్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. దీంతో పాటు కోలీవుడ్ లోనూ మరో సినిమాలో ఆమె నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. విడాకుల తర్వాత కెరీర్ విషయంలో సమంత ఏ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదని తెలుస్తోంది. గతంలో సమంత పాత్ర విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరి నిర్ణయం తీసుకునేది. అయితే ఇప్పుడు ఆమె హద్దులు చెరిపేసుకుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

దీంతో పాటు ఐటమ్ సాంగ్‌ల‌లో న‌టించేందుకు… క‌థ డిమాండ్ చేస్తే హాట్ క్యారెక్టర్లలో కూడా నటించేందుకు… హాట్ హాట్‌గా కనిపించేందుకు కూడా ఆమె వెనుకాడద‌ని అంటున్నారు. విడాకులకు ముందే ఆమె ఫ్యామిలీమ్యాన్ వెబ్‌సీరిస్‌లో కూడా కాస్త బోల్డ్‌గా క‌నిపించి సంచ‌ల‌నం క్రియేట్ చేసింది.

ఇక ఇప్పటి వరకు చిన్న హీరోలతో సినిమాలు చేసే విషయంలో సమంత ఆచితూచి వ్యవహరించేది . అయితే ఇప్పుడు ఆ విషయంలో కూడా సమంత వెనకాడటం లేదట. ఈ క్రమంలోనే నాని తో కూడా సమంత ఓ సినిమాలో నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా సమంత కెరీర్‌ కోసం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news