టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు వచ్చిన లేడీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ విజయశాంతికి సాటి రాగల హీరోయిన్ ఒక్కరు కూడా లేరు. ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు.. రివార్డులు గెలుచుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకునేవారు. అప్పట్లో విజయశాంతి తో సినిమా అంటే స్టార్ హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఆమె హీరోలతో సమానంగా డైలాగులు చెప్పడంలో కానీ డ్యాన్సులు చేయడంలో కానీ కానీ పోటీపడేవారు.
విజయశాంతి సినిమా రంగంలోనే కాదు.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా దూసుకుపోతోంది. తల్లి తెలంగాణ స్థాపించి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన ఆమె… ఆ తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఆ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా గెలిచారు. తర్వాత ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లి ఇప్పుడు బిజెపి లో కొనసాగుతున్నారు. ఇక విజయశాంతి హీరోయిన్ కావడానికి కారణం ఓ ప్రముఖ వ్యక్తి కారణం అట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు.
ఆ వ్యక్తి ఎవరో కాదు టి.కృష్ణ. దివంగత దర్శకుడు టి కృష్ణ ప్రముఖ హీరో గోపీచంద్ తండ్రి. ఆయన విప్లవాత్మక సినిమాల ద్వారా అప్పట్లో తెలుగు సినిమా రంగంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఈ తరం దర్శకుల్లో ఎంతో మంది టి.కృష్ణ శిష్యులు ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన నేటి భారతం సినిమాలో విజయశాంతి హీరోయిన్గా నటించింది. ఆ సినిమాకి కేవలం విజయశాంతి మాత్రమే సూటవుతుందని ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారట.
విజయశాంతిని ఆయన ఎప్పుడు శాంతమ్మ అని పిలుచుకునేవారు. విజయశాంతి కూడా టీ కృష్ణను అన్నా అని పిలుస్తూ ఉండేదట. ఆ తర్వాత టీ కృష్ణ తన సినిమాల్లో ఎక్కువగా విజయశాంతికే అవకాశం ఇచ్చారు. ప్రతిఘటన కూడా కేవలం విజయశాంతియే చేయాలని ఆమె డేట్స్ కోసం కొద్ది నెలల పాటు వెయిట్ చేశారట. టి. కృష్ణ సినిమాల్లో నటించడం వల్ల తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని విజయశాంతి ఎప్పుడు చెప్పేవారు. తనలోని నటిని వెలికి తీసిన ఘనత ఆయనదే అని ప్రశంసించారు.