సామాన్యంగా పెళ్ళిళ్ళు అనేవి ఎక్కువగా స్వర్గంలోనే నిర్ణయించబడతాయని కొంతమంది చెబుతూ ఉంటారు. వివాహ బంధం అనేది ఒక జంటను పదికాలాలపాటు కలిసి ఉంచుతుంది. అని కూడా తెలుపుతూ ఉంటారు మన పెద్ద వాళ్ళు. ఇకపోతే ఈ జంటలు మాత్రం అనుకోకుండా కొన్ని కారణాల చేత విడిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఎదురవుతోంది.. అదేమిటంటే విడిపోయే జంటలు కూడా స్వర్గంలో నిర్ణయిస్తారా?
అయితే ఈ విషయానికి మాత్రం ఎవరి దగ్గర సరైన సమాధానం ఉండదు. కానీ విడాకులు తీసుకున్న జంటలు మాత్రం చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు విడిపోయే జంటలు ఎక్కువగా పెరుగుతూనే ఉన్నారు. ఓకే ఇండస్ట్రీకి చెందిన వారు ప్రేమించి వివాహం చేసుకొని కూడా విడిపోతున్నారు. అయితే ఇలా టాలీవుడ్ లోనే ఎంత మంది ప్రేమించి వివాహం చేసుకొని, ఆ తర్వాత విడిపోయిన స్టార్స్ ని ఒకసారి చూద్దాం.
1). శారద-చలం:
అలనాటి హీరోయిన్ శారద,అప్పటి హీరో చలంను ప్రేమించి 1972 లో వివాహం చేసుకున్నది. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరూ 1984 లో విడిపోయారు.
2). రమ ప్రభ-శరత్ బాబు:
ఇక వీరిద్దరూ కూడా అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించారు. వీరిద్దరు కలిసి ప్రేమించుకొని1974 లో వివాహం చేసుకోగా ఆ తరువాత కొన్ని మనస్పర్థల వల్ల 1988 లో వీరి బంధానికి దూరమయ్యారు.
3). కమల్ హాసన్-సారిక:
విశ్వనటుడు కమల్ హాసన్ 1978 లో ఒక డ్యాన్సర్ వాణి ని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి కొన్ని సంవత్సరాలపాటు సంతోషంగా తమ జీవితాన్ని గడిపారు. ఇక వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వీరిద్దరూ 1988 లో విడిపోయారు. ఆ తర్వాత మరొక నటి సారికను పెళ్లి చేసుకున్నాడు. వీరికి శృతిహాసన్, అక్షరహాసన్ సంతానం కలిగింది. ఇక అంతే కాకుండా 2004 లో కూడా సారిక తో విడాకులు తీసుకున్నాడు కమలాసన్. ప్రస్తుతం గౌతమితో సహజీవనం చేస్తున్నట్లుగా సమాచారం.
4). ప్రకాష్ రాజ్-లలిత కుమారి:
ప్రకాష్ రాజ్, తమిళ నటి లలిత కూతురిని ప్రేమించి 1994లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు కూడా జన్మించారు. కొన్ని కారణాల చేత 2009 లో వీరు విడిపోయారు. ఆ తర్వాత పోని వర్మ ని వివాహం చేసుకున్నాడు.
5). సిద్ధార్థ్-మేఘన:
వీరిరువురు 2003 వ సంవత్సరంలో ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2007 లో వీరు విడిపోయారు.
6). నాగార్జున-లక్ష్మి:
డి.రామానాయుడు కూతురు లక్ష్మి తో 1984 లో వివాహం చేసుకున్నాడు నాగార్జున. ఆ తర్వాత 1990 లో వీరిద్దరు విడిపోయారు.
7). పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్:
పవన్ కళ్యాణ్ బద్రి సినిమా తో ప్రేమలో పడింది రేణుదేశాయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో వెయిటింగ్ చేసి వివాహం చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ కు అంతకుముందు నందిని అనే అమ్మాయి తో వివాహమైంది. అయితే కొద్ది రోజులకి ఈమెతో విడిపోయాడు పవన్. ఆ తర్వాత రేణు దేశాయ్ ని వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల చేత ఈమెను కూడా విడిచి పెట్టి వేరొక విదేశీయురాలు అన్నా లెజినోవా ను వివాహం చేసుకున్నాడు.
ఇక వీరి బాటలోనే నాగచైతన్య-సమంత, ఝాన్సీ- జోగినాయుడు, సుప్రియ యార్లగడ్డ-చరణ్ రెడ్డి, సుమంత్-కీర్తి రెడ్డి. కేవలం వీరంతా మన టాలీవుడ్ లోనే విడాకులు తీసుకున్నవారు.