కరోనా వచ్చి ప్రపంచం అతలా కుతలం అయినా కూడా మన సౌత్ స్టార్ హీరోయిన్లు మాత్రం వారి రేట్లు తగ్గించుకోవడం లేదు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా మన తెలుగులో సినిమా చేయాలంటే చాలు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. అటు తమిళ్, ఇటు కన్నడలోనూ వారికి అంత సీన్ ఉండదు. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అంత లోకువా లేదా అడిగినంత ఇవ్వక చస్తారా ? అన్న ఇదో కాని .. తెలుగులో మాత్రం వారు రేటు ఏ మాత్రం తగ్గించుకోరు. ఇక టాలీవుడ్‌లో నటిస్తోన్న టాప్ హీరోయిన్ల రెమ్యునరేషన్లు ఇలా ఉన్నాయి.
సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న నయనతార ఒక్కో సినిమాకు రు. 4 నుంచి రు. 6 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. రేటు విషయంలో ఆమెకు ఏ మాత్రం కనికరం లేదనే అంటున్నారు. అటు తమిళ్, ఇటు తెలుగులో వరుస ఛాన్సుల నేపథ్యంలో ఆమె ఆడిందే ఆట.. పాడిందే పాట అవుతోంది. ఇక పాన్ ఇండియా హీరోయిన్ అన్న ముద్ర వేసుకున్న పూజా హెగ్డే కూడా ఒక్కో సినిమాకు రు. 3 కోట్లు తీసుకుంటోందట.
ఇక రష్మిక ఇటీవల రేటు విషయంలో కొండెక్కి కూర్చుంటోందట. ఆమె ఒక్కో సినిమాకు రు. 2.5 నుంచి రు. 3 కోట్లకు తగ్గేదేలే అంటోందట. బాలీవుడ్ ఛాన్సులు రావడంతో రష్మిక సడెన్‌గా రేటు పెంచేసిందని అంటున్నారు. ఇక భర్త చైతుతో విడాకులు తీసుకున్నాక ఇప్పుడు సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ఆమె కూడా ఒక్కో సినిమాకు రు. 2.5 కోట్లకు తగ్గకుండా డిమాండ్ చేస్తోంది.
ఇక వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న కీర్తీ సురేష్ కూడా ఒక్కో సినిమాకు రు. 2 కోట్లకు తగ్గకుండా రెమ్యునరేషన్ తీసుకుంటోందట. ఈ స్టార్ హీరోయిన్లకు ఈ రెమ్యునరేషన్లతో పాటు హోటల్, ఇతర మెయింటైన్స్ ఖర్చులు కూడా తడిసి మోపెడు అవుతున్నాయి.