Moviesవాటికి నేను సెట్ అవ్వను..సీక్రెట్‌ బయటపెట్టిన తాప్సీ..!!

వాటికి నేను సెట్ అవ్వను..సీక్రెట్‌ బయటపెట్టిన తాప్సీ..!!

ఢిల్లీ భామ తాప్సీ..ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి..ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రిత‌మే తెలుగులో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యిన ఈ ముద్దుగుమ్మ..ఇప్పుడు బాలీవుడ్ లో తనదైన స్టైల్లో దూసుకుపోతుంది.

తెలుగులో కొన్ని సినిమాలు చేసినా… వెంక‌టేష్ లాంటి పెద్ద హీరోల ప‌క్క‌న అవ‌కాశాలు వ‌చ్చినా కూడా.. ఆమెకు ఎందుకో గాని స్టార్ డ‌మ్ రాలేదు. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్క‌డ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే తాప్సీనే గుర్తుకు వ‌స్తోంది.

హీరోయిన్ తాప్సీ. తప్పడ్, హసీనా దిల్ రుబ వంటి విభిన్ని చిత్రాల్లో నటించి బాలీవుడ్ సినీ పరిశ్రమలో అగ్ర కథనాయికగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మిథాలీ రాజ్ బయోపిక్ లో నటిస్తుంది. ఈ సందర్భంగా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది తాప్సీ. అందంగా కనిపించడం కోసం చిన్నప్పుడు తాప్సీ ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. అంతే కాదు ఎన్నో రకాల కెమికల్స్ వాడటం వల్ల జుట్టు బాగా రాలిపోయేదట.

తాప్సీ మాట్లాడుతూ.. “మీరు నా కళ్లు చూడండై.. పెద్దగా..చూడటానికి బాగోవు. అలాగే సినిమాల్లో కనిపించే హీరోయిన్స్ మాదిరిగా నా ముక్కు సన్నగా ఉండదు. ఇక లిప్స్ కూడా అందంగా కనిపించవు. ఆఖరికీ నా జుట్టు కూడా రింగు రింగులుగా ఉంటుంది. టీవీలో కనిపించే సెలబ్రిటీల లాగా నా జుట్టు రావలని.. సెలూన్‌కి వెళ్లి ఎన్నో ఐటెంస్ ట్రై చేసా. కానీ ఏదీ వర్క్ అవుట్ అవ్వలేదు. ఫైనల్ గా కెమికల్స్‌తో హెయిర్‌ని అందంగా చేసుకునేదాన్ని.

అలా ఓ రెండుసార్లు చేసుకున్నాక.. నాకు జట్టు హెవీగా రాలిపోయేది. దీంతో ఇక అటువైపుగా వెళ్లడం మానేసా. నిజం చెప్పాలంటే..జీవితాన్ని ప్రేమతో జీవించాలని, మనల్ని మనం ఇష్టపడితే తప్పకుండా బాహ్యప్రపంచానికి ఎంతో అందంగా కనిపిస్తామని అర్థమైంది. అప్పటి నుంచి అందంపై నా అభిప్రాయం మారింది’’ అని తాప్సీ అందానికి అసలైన సీక్రెట్‌ తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news