తెలుగు చిత్ర పరిశ్రమకు మూలస్తంభంగా సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ పరంగా కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ఎంతో మంది ప్రజలను ఆదుకోవడమే కాదు వారికి వచ్చిన అన్ని కష్టాలను నెరవేర్చిన గొప్ప మహనీయుడు గా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి అంటే, ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎంత గొప్పవో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ మంచి గుర్తింపు పొందుతోంది అంటే అందుకు కారణం ఎన్టీఆర్ చేపట్టిన సేవా కార్యక్రమాలు అని చెబుతూ ఉంటారు ప్రజలు. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ వ్యక్తిగత విషయాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయనకు ఎంత మంది సంతానం అనే విషయం ఈతరం జనరేషన్లో కూడా చాలా మందికి తెలియని విషయం. ఎన్టీఆర్ బసవతారకంను వివాహం చేసుకున్న తర్వాత వీరికి ఎంత మంది సంతానం.. ఆ తర్వాత లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు కదా ..! వారికి ఎంత మంది సంతానమో తెలుసుకుందాం.
సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కొడుకులు అనగానే హరికృష్ణ, బాలకృష్ణ మాత్రమే గుర్తొస్తారు.. నిజానికి ఆయనకు ఎనిమిది మంది కొడుకులు, నలుగురు కూతుర్లు. నందమూరి తారక రామారావు మొదటి కొడుకు పేరు నందమూరి రామకృష్ణ.. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు. రెండవ కుమారుడు నందమూరి జయకృష్ణ. ఇక మూడవ సంతానంగా దగ్గుబాటి పురందేశ్వరి జన్మించింది. ఇక నాల్గవ సంతానంగా నందమూరి సాయి కృష్ణ జన్మించారు. ఇక ఈయన కూడా మరణించారు. ఐదవ సంతానంగా నాలుగవ కొడుకుగా నందమూరి హరికృష్ణ జన్మించారు. ఈయన ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఆరవ సంతానంగా ఐదో కుమారుడుగా నందమూరి మోహనకృష్ణ జన్మించారు. తారకరత్న ఎవరో కాదు నందమూరి మోహనకృష్ణ కొడుకు. ఏడో సంతానంగా ఆరవ కొడుకు గా నందమూరి బాలకృష్ణ జన్మించారు. ఇక ఈయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడో కుమారుడిగా రామకృష్ణ జూనియర్ జన్మించారు. ఇక ఎనిమిదో కుమారుడు నందమూరి జయశంకర్ కృష్ణ . నలుగురు కూతుర్ల విషయానికొస్తే దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, గారపాటి లోకేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి.