Moviesఅన‌సూయ 15 ఏళ్ల‌కే ఎలా ప్రేమ‌లో ప‌డింది... !

అన‌సూయ 15 ఏళ్ల‌కే ఎలా ప్రేమ‌లో ప‌డింది… !

స్టార్ యాంక‌ర్ అన‌సూయను చూసి చాలా మంది అసూయ ప‌డుతూ ఉంటారు. పెళ్ల‌య్యింది.. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. నాలుగు ప‌దుల వ‌య‌స్సు దాటింది. అయినా కూడా ఆమె ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఎంతో మంది కుర్ర యాంక‌ర్లు వ‌స్తున్నా బుల్లితెర‌పై త‌న‌కు తానే సాటి అన్న‌ట్టుగా దూసుకు పోతోంది. మ‌రో వైపు ఇటు వెండితెర మీద కూడా ప‌వ‌ర్ ఫుల్ రోల్స్ చేస్తూ ఈ త‌రం యాంక‌ర్ల‌లో ఇటు బుల్లితెర‌పై, అటు వెండితెర‌పై త‌న‌ను ఢీ కొట్టేవారే లేరంటోంది.

ఇక ఆమె 15 ఏళ్ల వ‌య‌స్సులోనే ప్రేమ‌లో ప‌డింద‌ట‌. యాంక‌ర్ కాక‌ముందు ఆమె చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ఎంబీయే గ్రాడ్యుయేట్ అయిన‌ ఆమె ఓ కంపెనీలో హెచ్ఆర్‌గా ఉద్యోగం చేశారు. అంత‌కు ముందే ఆమె ఓ బ్యాంక్‌లో టెలీకాల‌ర్‌గా నెల‌కు రు. 5 వేల జీతానికి ప‌నిచేశారు. అదే ఆమె ఫ‌స్ట్ ఉద్యోగం, జీతం. ఆ త‌ర్వాత సిక్స్ లాయిడ్ అనే విజువ‌ల్ కంపెనీలో ఆమె హెచ్ ఆర్ గా ఉన్న‌ప్పుడు అక్క‌డ‌కు చాలా మంది ఇండ‌స్ట్రీ పెద్ద‌లు వ‌చ్చేవార‌ట‌.

ఈ క్ర‌మంలోనే ఆమెను చూసిన కొంద‌రు డైరెక్ట‌ర్లు ఆమెకు సినిమాల్లో అప్పుడే ఛాన్స్ ఇస్తామ‌ని కూడా చెప్పార‌ట‌. ఆర్య 2లో ఛాన్స్ ఇస్తామ‌ని సుకుమార్ అప్పుడే ఆమెకు బిగ్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. అయిటే అది ఎట్ట‌కేల‌కు రంగ‌స్థ‌లంతో నెర‌వేరింది. ఇక అన‌సూయ త‌న భ‌ర్త‌ను మొద‌టిసారిగా త‌న 15 ఏళ్ల వ‌య‌స్సులో ఎన్సీసీ క్యాంప్‌లో క‌లిసింది. ఆలీతో స‌ర‌దాగా షోలో ఆమె ఈ విష‌యం చెప్పింది.

వెంట‌నే ఆలీ ఎస్సీసీలో ట్రైనింగ్ తీసుకోకుండా… ల‌వ్ ట్రైనింగ్ తీసుకున్నావా ? అని అన‌డంతో అన‌సూయ క‌ళ్యాణం అయినా క‌క్కు అయినా తెలిసి రాదుగా అని న‌వ్వేసింది. అక్క‌డ ఏర్ప‌డిన ప‌రిచ‌యంతో కొద్ది రోజుల‌కే వీరు ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌దుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news