సౌత్ ఇండియాలోనే టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్‌రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన ప్రకాష్‌రాజ్ ఇటీవల మా ఎన్నికల్లో కూడా పోటీ చేసి మంచు విష్ణు చేతిలో ఓడిపోయారు. ప్రకాష్‌రాజ్ తెరమీద ఎంత గొప్ప నటుడో…. ఎన్ని అవార్డులు గెలుచుకున్నారో .. బయట ఆయన వివాదాలకు కేరాఫ్. షూటింగ్‌లకు త్వరగా రారని.. దర్శక, నిర్మాతలనే కాదు హీరోలను కూడా ఇబ్బంది పెడతారన్న అపవాదు ఆయనపై ఉంది. అందుకే ఆయనపై తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండుసార్లు బ్యాన్ విధించింది.
ఇక ప్రకాష్‌రాజ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన ముందుగా లలితా కుమారిని పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లల తర్వాత ఓ ప్రమాదంలో ప్రకాష్‌రాజ్ కుమారుడు మృతి చెందాడు. అప్పుడు మనస్పర్థలు రావడంతో వీరు విడిపోయారు. తర్వాత ప్రకాష్ రాజ్ బాలీవుడ్ డ్యాన్సర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూడా ఒక కొడుకు ఉన్నాడు.
అయితే ప్రకాష్‌రాజ్ లలితా కుమారికి విడాకులు ఇచ్చాక ఓ మహిళా రాజకీయ నేతను పెళ్లి చేసుకుంటున్నాడని ప్రచారం జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో శోభారాణి అనే మహిళా నేత పెద్ద హడావిడి చేశారు. ఆమె ప్రెస్‌మీట్లలో ప్రజారాజ్యం గళాన్ని వినిపించారు. ఆ శోభారాణినే ప్రకాష్‌రాజ్ పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి.
అప్పుడు ప్రకాష్‌రాజ్ సైతం తనకు ఫోన్ చేసి ఏంటమ్మా ఇలా జరిగింది ? అన్నారని.. సినిమాలు, రాజకీయాల్లో ఉన్న వారిని ఇలా టార్గెట్ చేయడం మామూలే అని తాను చెప్పానని ఆమె తెలిపింది. ఇక ప్రకాష్‌రాజ్‌ను తాను ఒకటి రెండు సార్లు మాత్రమే కలిశానని చెప్పింది.