సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఎప్పటకీ క్రేజ్ ఉంటుంది. ఈ తరంలో చూస్తే ఎన్టీఆర్ – రాజమౌళి, ఎన్టీఆర్ – ప్రభాస్, కొరటాల – మహేష్, గుణశేఖర్ – మహేష్ ఇలా కాంబినేషన్లు ఎక్కువుగా రిపీట్ అయ్యి హిట్లు కొడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో కూడా కొన్ని కాంబినేషన్లకు ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. బాలయ్య – బి.గోపాల్, బాలయ్య – కోడి రామకృష్ణ ఇలా కొన్ని కాంబినేషన్ల నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్లు వచ్చాయి.
అయితే బాలయ్య కెరీర్‌లో తొలి సారి వరుసగా బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఘనత మాత్రం కోడి రామకృష్ణదే. తొలి సిల్వర్ జూబ్లి కూడా బాలయ్యకు కోడి రామకృష్ణే ఇచ్చారు. వీరి కాంబోలో 7 సినిమాలు వస్తే అందులో 5 తిరుగులేని బ్లాక్ బస్టర్లు కొట్టాయి. మరో సినిమా సూపర్ హిట్ కాగా… మరొకటి మాత్రం డిజాస్టర్ అయ్యింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల గురించి తెలుసుకుందాం.
1- మంగమ్మగారి మనవడు:
ఈ సినిమా బాలయ్యకు మంచి కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. 500 రోజులు ఆడి ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. సుహాసిని హీరోయిన్‌గా నటించింది.
2- ముద్దుల కృష్ణయ్య:
బాలయ్య – కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమాగా ముద్దుల కృష్ణయ్య నిలిచింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
3- మువ్వగోపాలుడు:
వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడో సినిమా మువ్వగోపాలుడు. ఈ సినిమా కూడా హ్యాట్రిక్ కొట్టడంతో పాటు తిరుగులేని బ్లాక్ బస్టర్ అయ్యింది.
4. భారతంలో బాలచంద్రుడు:
బాలయ్య – రామకృష్ణ కాంబోలో వచ్చిన నాలుగో సినిమా అయిన భారతంలో బాలచంద్రుడు భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
5. ముద్దుల మామయ్య:
ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన ఐదో సినిమా ముద్దుల మావయ్య ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
6. బాల గోపాలుడు:
బాలయ్య – రామకృష్ణ కాంబోలో వచ్చిన ఆరో సినిమా అయిన బాలగోపాలుడు సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతోనే నందమూరి కళ్యాణ్‌రామ్ బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు.
7. ముద్దుల మేనల్లుడు:
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఏడో సినిమా ముద్దుల మేనల్లుడు కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది.
తర్వాత వీరి కాంబోలో 8వ సినిమాగా ఓ జానపద చిత్రం ప్రారంభమై ఆగిపోయింది.