సెలబ్రిటీలు అన్నాక వారి కాస్ట్యూమ్స్ కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఇటీవలే నాగార్జున బిగ్‌బాస్ షోకు వేసుకు వచ్చిన ఓ షర్ట్ ఖరీదే ఏకంగా రు. 82 వేలు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆ షర్ట్ రేటు చూసిన వాళ్లు వామ్మో అని నోరు వెళ్లబెడుతున్నారు. ఇక ఇప్పుడు హీరోయిన్ జెనిలీయా వేసుకున్న ఓ చీర ఖరీదు గురించి కూడా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కెర్లు కొడుతోంది. బాలీవుడ్‌లో పదిహేనేళ్ల క్రితం ఓ ఊపు ఊపేసిన జెనీలియా తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది.
ఆమె నటించిన రెఢీ, ఢీ, సాంబ సినిమాలు ఆమెకు ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చాయి. రాజమౌళి దర్శకత్వంలో నితిన్‌తో సై సినిమా కూడా చేసింది. ఆ తర్వాత జెనీలియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ చిన్న కుమారుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుని ముంబైలో సెటిల్ అయిపోయింది.
పెళ్లి తర్వాత బుల్లితెరపై సందడి చేస్తోన్న జెనీలియా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడంతో పాటు తన బ్యూటిఫుల్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. తాజాగా జెనీలియా చీరకట్టుతో దిగిన ఓ ఫొటో తన సోషల్ మీడియా అక్కౌంట్లలో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపిస్తోంది. ఆ ఫొటోకు విపరీతంగా నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.
జెనీలియా వేసుకున్న ఈ చీర రేటు గురించి సెర్చ్ చేసిన నెటిజన్లు … దీని ఖరీదు రు. 22 వేలు పైనే ఉంటుందని చెపుతున్నారు. ఇక జెనీలియా మళ్లీ సినిమాల్లో యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారు. ఆమె వయస్సు పెరిగినా వన్నె ఏ మాత్రం తగ్గలేదని.. ఆమె తిరిగి సినిమాల్లో యాక్టివ్ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.