మన తెలుగు సినిమా రంగంలో కులాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ కొన్ని కులాల వారిదే రాజ్యం అన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. మన తెలుగులో రెండు, మూడు కులాలకు చెందిన హీరోలు, నిర్మాతలే ఎక్కువుగా హవా చెలాయిస్తూ ఉంటారని ఆరోపణలు ఉన్నాయి. స్టార్ హీరోలుగా ఉన్న వారిలో ఎక్కువ మంది కమ్మ లేదా కాపు కులాలకు చెందిన వారే ఉన్నారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఈ రెండు కులాలదే ఎక్కువ డామినేషన్. సరే హీరోల సంగతి ఇలా ఉంటే .. తెలుగులో నటించిన కొందరు హీరోయిన్లు కూడా ఏ కులాలకు చెందిన వారు అన్న ఇంట్రస్టింగ్ పాయింట్‌పై అప్పుడప్పుడు సోషల్ మీడియాలో డిస్కర్షన్లు నడుస్తూ ఉంటాయి.
ఒక్కసారి తెలుగులో స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారిలో ఎవరు ఏ కులానికి చెందిన వారో చూద్దాం. టాలీవుడ్‌ను పదిహేనేళ్ల నుంచి ఏలుతోన్న స్వీటి శెట్టి ( అనుష్క) కర్నాకటలో శెట్టి వర్గానికి చెందిన అమ్మాయి. ఇక మరో స్టార్ హీరోయిన్ సమంత క్రిస్టియన్ కులానికి చెందిన అమ్మాయి కాగా… మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కులస్తురాలు అట.
ఇక నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి తమిళనాడు – కేరళ సరిహద్దుల్లో ఉండే పిళ్లై కులానికి చెందిన అమ్మాయి. ఇక వెండితెరపై చందమామగా అందరి ప్రశంసలు పొందిన కాజల్ అగర్వాల్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఇక రకుల్‌ప్రీత్ సింగ్ సిక్కు కుటుంబానికి చెందిన వారు కాగా.. ఛార్మీ కౌర్, పూనమ్ కౌర్ కూడా పంజాబ్‌లో కౌర్ వర్గానికి చెందిన వారు.
కీర్తీ సురేష్ బ్రాహ్మణుల్లో ఓ వర్గం అయిన నాయర్ కుటుంబం నుంచి వచ్చింది. ఇక హన్సిక సింధీ కుటుంబం నుంచి రాగా.. బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా వైశ్య వర్గానికి చెందిన అమ్మాయే. ఇక నీత్యా మీనన్ కూడా నాయర్లే.. నివేద థామస్ మళయాళీ క్రిస్టియన్ అమ్మాయి. ఇక శృతీహాసన్ బ్రాహ్మిణ్. ఆమె సీనియర్ నటి సుహాసినికి కజిన్. ఇక ఇటీవల పెళ్లి సందడి సినిమాతో మెప్పించిన శ్రీ లీల కమ్మ వర్గానికి చెందిన అమ్మాయి.