Moviesటాలీవుడ్ స్టార్ హీరోల‌కు ఏ వ‌య‌సులో పెళ్లిళ్లు అయ్యాయో తెలుసా..!

టాలీవుడ్ స్టార్ హీరోల‌కు ఏ వ‌య‌సులో పెళ్లిళ్లు అయ్యాయో తెలుసా..!

టాలీవుడ్‌లో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. వీరిలో చాలా మంది వార‌స‌త్వం అండ‌తోనే సినిమాల్లోకి వ‌చ్చారు. వీరిలో మూడొంతుల హీరోలు క‌రెక్టు టైంలో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంద‌రు మాత్రం మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటేసి నాలుగో ద‌శాబ్దంలోకి ఎంట్రీ ఇస్తున్నా కూడా పెళ్లికి దూరం జ‌రుగుతున్నారు. ఇక మ‌న స్టార్ హీరోల‌కు ఏ వ‌య‌స్సులో పెళ్లి అయ్యిందో అన్న ఇంట్ర‌స్టింగ్ విష‌యం చూద్దాం.

విశ్వ‌విఖ్యాత న‌ట సౌర్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావుకు కేవ‌లం 20 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడే బ‌స‌వ తార‌కంతో పెళ్లి జ‌రిగింది. ఇక అక్కినేని నాగేశ్వ‌ర‌రావు 25 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు అన్న‌పూర్ణ‌మ్మ‌ను పెళ్లి చేసుకున్నారు. ఇక కృష్ణ త‌న మొద‌టి భార్య‌ను పెళ్లి చేసుకున్న‌ప్పుడు ఆయ‌న వ‌య‌స్సు కేవ‌లం 19 సంవ‌త్స‌రాలే. చాలా చిన్న వ‌య‌స్సులోనే ఇందిరాదేవితో ఆయ‌న‌కు పెళ్లి అయిపోయింది. ఇక ఆంధ్రుల అల‌నాటి అందాల న‌టుడు శోభ‌న్‌బాబు అయితే 21 సంవ‌త్స‌రాల‌కు పెళ్లి చేసుకున్నారు.

ఇక స్టార్ సింగ‌ర్ ఎస్పీ. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం 23 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో 1969లో పెళ్లి చేసుకున్నారు. సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా స్టార్ డ‌మ్ రావ‌డానికి ముందే త‌న 24 ఏళ్ల వ‌య‌స్సులో అల్లు రామ‌లింగ‌య్య కుమార్తె సురేఖ‌ను పెళ్లి చేసుకున్నారు.

ఇక బాల‌కృష్ణ కేవ‌లం 22 సంవ‌త్స‌రాల‌కే వ‌సుంధ‌ర దేవిని పెళ్లి చేసుకుంటే.. క‌మ‌ల్‌హాస‌న్ సారిక‌ను ( ఆమె రెండో భార్య‌, అప్ప‌టికే క‌మ‌ల్‌కు వాణీ గ‌ణ‌ప‌తితో పెళ్ల‌య్యింది) 24 ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్నారు. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ 1985లో త‌న 24 ఏళ్ల వ‌య‌స్సులోనూ, నాగార్జున ల‌క్ష్మి ( మొద‌టి భార్య‌)ని 24 ఏళ్ల‌కు, డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ జీవిత‌ను 30 ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్నారు.

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ 2011లో త‌న 28 ఏళ్ల వ‌య‌స్సులో ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని పెళ్లి చేసుకున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ కి 27ఏళ్ళ వయస్సులో ఉపాసనతో… స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ 28 ఏళ్లకు స్నేహారెడ్డితో పెళ్లి అయ్యింది. స‌మంత‌ను పెళ్లాడే టైంకు నాగ‌చైత‌న్య వ‌య‌స్సు 31. రానా 2020లో 35 ఏళ్ల లేట్ ఏజ్‌లో మిహికా బ‌జాజ్‌ను పెళ్లాడాడు. ఇక నితిన్ 37 ఏళ్ల లేట్ ఏజ్‌లోనే 2020లో పెళ్లి చేసుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news