తెలుగు సినిమా రంగంలో అక్కినేని ఫ్యామిలీ గత 50 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఈ వంశంలో దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు వేసిన పునాదిని ఆ తర్వాత రెండో తరంలో ఆయన వారసుడు నాగార్జున కంటిన్యూ చేశారు. ఏఎన్నార్ తర్వాత నాగార్జున కూడా స్టార్ హీరోగానే ఉన్నారు. ఇక మూడో తరం హీరోలుగా నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే ఒకేసారి ఈ ఇద్దరు హీరోలు లవ్‌స్టోరీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలతో హిట్లు కొట్టారు.
ఇక నాగ్ – అమల ముద్దుల తనయుడు అఖిల్ విషయానికి వస్తే అఖిల్ నవ మన్మథుడుగా దూసుకుపోతున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో మూడు వరుస ప్లాపులతో ఇబ్బంది పడ్డా కూడా ఎలిజబుల్ బ్యాచిలర్ హిట్ అయ్యి అఖిల్‌కు ఎట్టకేలకు సక్సెస్ ఇచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఇక అఖిల్‌కు టాలీవుడ్‌లో ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలలో ఎవరు ఇష్టమన్న ప్రశ్నకు నాగ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.
అఖిల్ సినిమాల్లోకి రాకముందు ఏ హీరో సినిమా చూస్తే ఆ హీరోయే ఇష్టమని చెప్పేవాడట. ముందు అల్లు అర్జున్ డ్యాన్సులు, స్టైల్ ఇష్టమని.. అతడే ఫేవరెట్ హీరో అని చెప్పాడట. తర్వాత పోకిరి చూసి మహేష ఫేవరెట్ అయ్యాడని.. మగధీర చూసి రామ్‌చరణ్ చింపేశాడని చెప్పాడట. వీళ్లెవ్వరు కాదు నేను నీ నాన్నను రా నేనే నీ ఫేవరెట్‌ను అని నాగార్జున అంటే … నువ్వు ఓల్డ్ డాడీ.. అని సరదాగా జోక్ చేసేవాడట. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ఓ సందర్భంలో ప్రస్తావించారు.
ఇక అఖిల్ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న బంగార్రాజు సినిమా చేస్తున్నారు.