Newsఇప్పటి వరకు ఆ దేశాలలో ఎయిర్ పోర్ట్ లేదని మీకు తెలుసా..?

ఇప్పటి వరకు ఆ దేశాలలో ఎయిర్ పోర్ట్ లేదని మీకు తెలుసా..?

ఈమధ్య చాలా వరకు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఎక్కువవుతోంది కాబట్టి చాలామంది తమ సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం విమానాలను ఆశ్రయిస్తున్నారు.. కాలం మారుతున్న కొద్దీ రవాణా రంగంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ధనికులు మాత్రమే ఈ విమానాలలో ప్రయాణించే వారు కానీ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు కూడా ప్రయాణిస్తున్నారు.. మరీ ముఖ్యంగా మన దేశంలో అయితే చిన్న చిన్న పట్టణాలకు కూడా ఈ విమాన సేవలు అందుబాటులోకి రావడం గమనార్హం.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ దేశాలలో ఇప్పటి వరకు కూడా ఒక్క ఎయిర్ పోర్ట్ కూడా లేదని మీకు తెలుసా..? అవన్నీ కూడా యూరప్ ఖండంలోనే ఉండడం గమనార్హం.. మరి ఎయిర్ పోర్ట్ లేని ఆదేశాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం..

1. వాటికన్ సిటీ:
ఇటలీ దేశంలో వాటికన్ సిటీ కి ఒక ప్రత్యేకత ఉంది అనే విషయం తెలిసిందే. ప్రపంచంలోకెల్లా అతి చిన్న దేశం గా కూడా వాటికన్ సిటీ గుర్తింపు పొందింది. 1000 లోపు జనాభా ఉన్న ఈ చిన్న దేశానికి ఎయిర్ పోర్ట్ లేదు. అయితే వాటికన్ సిటీ కి వెళ్ళాలి అంటే రోమ్లోని సియాంపినో ఎయిర్పోర్ట్ లేదా ఫిమైసినో ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వాటికన్ సిటీకి చేరుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ప్రముఖులు అయితే హెలికాప్టర్ ద్వారా రోమ్ నగరానికి చేరుకుంటారు.

2. అండోర్రా:
యూరప్ లో ఉన్న అతి అందమైన దేశాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడి కొండలు, లోయలు, ప్రకృతి ఇలా ప్రతి ఒక్కటి కూడా పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. జనాభా విస్తీర్ణం పరంగా చూసుకుంటే ఈ దేశం చాలా పెద్దది అయినప్పటికీ ఇక్కడ విమానయాన సదుపాయం లేదు. ఇక్కడికి చేరుకోవాలంటే మాత్రం స్పెయిన్, ఫ్రాన్స్ లోని ఎయిర్ పోర్ట్ లో దిగి ఆ తరువాత రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది.

3. శాన్ మారినో:
ఇటలీ భూభాగంలో స్వతంత్ర దేశంగా ఉన్న ఈ దేశంలో 40 వేల మంది జనాభా ఉన్నారు. అయితే ఇక్కడికి విమానంలో వెళ్లే అవకాశాలు అయితే లేవు కానీ ఇటలీ లో ఉన్న బొలొగ్నా,రిమిని ఎయిర్పోర్ట్లో దిగి రోడ్డు మార్గం లో వెళ్లాల్సి ఉంటుంది.

4. మొనాకో:
మొనాకో కూడా చాలా చిన్న దేశం ..మూడు వైపులా ఫ్రాన్స్ సరిహద్దు లు ఉంటాయి.. 40 వేల లోపు జనాభా ఉండే ఈ దేశంలో ఎయిర్ పోర్ట్ లేదు. అయితే ఇక్కడికీ చేరుకోవాలి అంటే ఫ్రాన్స్లోని నైస్ కొట్ డిఅజుర్ ఎయిర్పోర్టులో దిగాల్సి ఉంటుంది.. అక్కడి నుంచి అరగంట రోడ్డు ప్రయాణం చేస్తే మొనాకో చేరుకోవచ్చు.

5. లిచెన్ స్టైన్:
ఇక్కడ కూడా ఎయిర్ పోర్ట్ లేదు. ఇక్కడికి చేరుకోవాలంటే మాత్రం స్విట్జర్లాండ్ , ఆస్ట్రియా దేశాల సరిహద్దుల్లో ఉన్న ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గం లేదా పడవ ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. ఇప్పటికి రైలు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news