మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగా బ్రదర్ నాగబాబు, సంఘవి, ప్రముఖ హీరోయిన్ సిమ్రాన్ కలిసి నటించిన చిత్రం మృగరాజు. సాధారణంగా ఒక స్టార్ హీరో సినీ కెరీర్ లో హిట్ సినిమాలు ఎన్ని ఉన్నాయో, ఫ్లాప్ సినిమాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి అని చెప్పవచ్చు.. ఒక్కొక్కసారి కొన్ని సినిమాల వల్ల హీరోలకు చెడ్డపేరు కూడా వస్తూ ఉంటుంది. ఇకపోతే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ గా తెరకెక్కిన చిత్రం మృగరాజు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, అడవి బ్యాక్డ్రాప్లో ఈ మూవీని చాలా చక్కగా తెరకెక్కించారు. ఇక పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఒక ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దేవి వరప్రసాద్ నిర్మించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.అయితే అందులో చిరంజీవితో మాత్రమే 6 సినిమాలను దేవి వరప్రసాద్ నిర్మించారు. మొత్తం పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించినా, ఒక హాలీవుడ్ సినిమాకు ఇన్స్పిరేషన్ గా ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం. అడవి మృగాలకు రాజు సింహం కాబట్టి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో సింహంతో చిరంజీవి పోరాడాల్సి వచ్చింది. ఇందుకోసం అప్పటికే ఎన్నో హాలీవుడ్ చిత్రాలలో నటించిన జాక్ అనే సింహాన్ని ఎన్నుకున్నారు.
అయితే ఈ సింహం కోసం నిర్మాత దేవి వరప్రసాద్ ఏకంగా 67 లక్షల రూపాయలను ఖర్చు పెట్టి 26 రోజుల పాటు వీరిద్దరి మధ్య సన్నివేశాలను చిత్రీకరించారట. అంతేకాదు ఈ సినిమా కోసం రోజుకు 20 గంటలు చొప్పున చిరంజీవి కష్టపడ్డారు. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా సోనాలి బింద్రే కు ఆఫర్ వచ్చినా, ఆమె కొన్ని కారణాలవల్ల తప్పుకుంది. ఇక ఈ సినిమా కోసం చిరంజీవి 150 రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్నారు. కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం గమనార్హం.