జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది ఫరియా అబ్దుల్లా. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. గతంలో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసినా ‘జాతిరత్నాలు’ సినిమాలో హీరోయిన్ గా తన నవ్వుతో, తన అల్లరితో, తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో స్టార్ అయిపొయింది. చిట్టి చిట్టి పాటతో చాలా మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ సినిమాలో తన నటన, కామెడీ టైమింగ్‌తో యూత్‌కు బాగా కనెక్ట్ అయింది ఫరియా. జాతిరత్నాలు సినిమా తర్వాత ఆమెకు భారీగా ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. కాకపోతే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో అలా మెరిసి..ఇలా వెళ్లిపోయింది. కానీ ఈమెను తెర పై హీరోయిన్‌గా చూసేందుకే అభిమానులు ఇష్టపడుతున్నారు.
శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్‌లో 2007 వచ్చిన ఢీ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మంచు విష్ణు కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్. ఇక ఎప్పటి నుండో ఈ సినిమాకు సీకెవల్ వస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు ‘ఢీ అండ్ ఢీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసార్య్. ‘డబుల్ డోస్‘ అనే ఉపశీర్షికను కూడా పెట్టారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా ’జాతి రత్నాలు‘ ఫేం ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లాను ఎంపిక చేసినట్టు శ్రీను వైట్ల తెలిపారు. అయితే ఢీ సినిమాకు దీనికి అసలు మ్యాచ్ అవ్వదు అని. ఈ సినిమాలో చాలా మార్పులు మీరు చూస్తారు అని ..కొన్ని క్యారెక్టర్స్ మాత్రం అవే ఉంటాయని అన్నారు. ఇటీవలి కాలంలో సరైన విజయాలు లేని మంచు విష్ణు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో..!!