Moviesమెగాస్టార్‌తో జోడీ క‌ట్టి ఆయ‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన బాలీవుడ్ హీరోయిన్‌..!

మెగాస్టార్‌తో జోడీ క‌ట్టి ఆయ‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన బాలీవుడ్ హీరోయిన్‌..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. అలనాటి తరంలో ఇప్పటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తల్లి మేన‌క‌తో నటించిన చిరంజీవి… రాధిక – రాధ – సుహాసిని – విజయశాంతితో మొదలుకొని ఆ తర్వాత తరంలో రమ్యకృష్ణ – రంభ – రోజా ఆ తర్వాత తరంలో సోనాలి బింద్రే – ఆర్తి అగర్వాల్ – తమన్నా – నయనతార – అనుష్కతో కూడా చిరంజీవి ఆడిపాడుతున్నారు. తన 150 సినిమాల పరంపరలో చిరు ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుని ఉంటారు. వీరిలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు మాత్రమే కాదు… బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఉన్నారు.

చిరంజీవి ఏ హీరోయిన్ తో నటించిన కూడా వారందరూ కూడా చిరుతో కచ్చితంగా మరో సినిమా చేయాలని కోరుకునే వారు. అంత ఆప్యాయంగా చిరు హీరోయిన్లను చూసుకునేవాడట. అందుకే కొందరు హీరోయిన్లతో చిరు పదేపదే కాంబినేషన్ రిపీట్ చేసి హిట్లు కొట్టారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆపద్బాంధవుడు సినిమా తెరకెక్కింది. మంచి కథా బలం తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.

ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి నటించింది. ఆ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆము స్టైల్‌, లుక్స్ మ‌న ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేశాయి. మీనాక్షి ఆ సినిమాలో నటించిన అన్ని రోజులు కూడా చిరంజీవి ఎంతో కేర్ తీసుకునే వారట. సినిమా షూటింగ్ అయిపోయాక మీనాక్షి చిరుతో మీరు ఈ సినిమాకు నిర్మాత కాదు … దర్శకుడు కాదు… ప్రొడక్షన్ మేనేజర్ కాదు అయినా నా విషయంలో ఇంత స్పెషల్ కేర్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింద‌ట‌.

అయితే మీరు బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ నటిస్తున్నారని… మీకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవటం మా బాధ్యత అని చెప్పడంతో ఆమె చిరు మనస్తత్వానికి, సేవా ధృక్ప‌థానికి ఫిదా అయిపోయిందట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news