బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టేంట్స్ యమ జోరు మీద ఆడుతున్నారు. గ్రూప్ గేం లు అంటూ ఒక్కరు, ఫ్రెండ్ షిప్ అంటూ మరోకరు..స్ట్రాటజీ అంటూ ఇంకోకరు ఎవరికి నచ్చిన తీరులో వారు ఆడుతున్నారు. మొత్తానికి టాప్ 5 లో ఉండడానికి ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ మిగత ఆరు రోజులు ఎలా ఉన్నా..నామినేషన్స్ చేసే రోజు మాత్రం అందరి బీపీ హై లో ఉంటది ఏమో అనిపిస్తుంది టీవీ చూసేవాళ్లకు.
ఇకపోతే రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి తన ఇంటికి వచ్చేసారు యానీ మాస్టర్. ఫ్రెండ్స్ గ్రాండ్ వెల్కం ఇచ్చారు. ఇక మాస్టర్ కూడా మాస్ స్టెప్పులతో ఇరగదీసారు. ఇక హౌస్ ఉన్నంత సేపు కాజల్ ని వెక్కిరిస్తూ..నామినేట్ చేసిన మాస్టర్..బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో జరిగే గొడవలను చూసి ఓ వీడియో చేసారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ..”మీరు ఒకరికి ఫాలోవరే కావచ్చు, అభిమానే కావచ్చు. కానీ ఆ వ్యక్తి ఒకరిని అమ్మేస్తానంటే కరెక్టే, అప్పడం చేస్తానంటే కూడా పెద్దగా పట్టించుకోరు. అదే నేను డ్యాన్స్ చేస్తే మాత్రం చులకన చేస్తున్నానని, అగౌరవపరుస్తున్నానంటూ దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. ఇది న్యామేఅనా” అంటూ మండిపడింది.
ఇదిలా ఉంటే యానీ మాస్టర్ హౌజ్ నుంచి బయటకు రాగానే ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అదే ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ గురించి. 11 వారాల పాటు హౌజ్‌లో ఉన్న ఆనీ మాస్టర్‌కు బిగ్‌బాస్ కళ్ళు చెదిరే పారితోషకం ఇచ్చిన్నట్లు వార్తలు వస్తున్నాయి. యానీ మాస్టర్‌కు బిగ్‌బాస్ వారానికి ఏకంగా రూ. 3 లక్షల మేర రెమ్యునరేషన్ అందించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆనీ మాస్టర్ ఈ సీజన్లో పాల్గొన్నందుకు రూ. 30 లక్షలకుపైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆమె హౌస్‌లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఆధారంగా ఈ రెమ్యునరేషన్ ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఫిల్మీదునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.