Moviesచైతుతో అనుష్క ఎంగేజ్‌మెంట్‌... నిజంగానా... ఎప్పుడు...!

చైతుతో అనుష్క ఎంగేజ్‌మెంట్‌… నిజంగానా… ఎప్పుడు…!

టాలీవుడ్‌లోకి అక్కినేని వంశం నుంచి మూడోతరం హీరోగా జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగచైతన్య. జోష్ పెద్దగా ఆకట్టుకోకపోయినా ఏం మాయ చేశావే సినిమాతో ఒక్కసారిగా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మధ్యలో కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా తాజాగా విడుదలైన లవ్‌స్టోరీ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక స్టార్ హీరోయిన్ స‌మంత‌ను ప్రేమ వివాహం చేసుకున్న చైతు నాలుగేళ్ల పాటు ఆమెతో క‌లిసి కాపురం చేశాడు.

రెండు నెలల క్రితమే మనస్పర్థల కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చారు. విడాకుల తర్వాత స‌మంత మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఆవేదనను, బాధ‌ను వ్యక్తం చేస్తూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటోంది. అయితే చైతు మాత్రం ఎప్పటి లాగానే సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. వీరి విడాకుల త‌ర్వాత త‌ప్పు ఎవ‌రిది అన్న దానిపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల సంగ‌తి ఎలా ? ఉన్నా కూడా ఇప్పుడు చైతు – స్వీటీ శెట్టి అనుష్క ఎంగేజ్‌మెంట్ వార్త‌లు మ‌రోసారి తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. గ‌తంలో 2017లో చైతు – అనుష్క ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింద‌ని.. వీరు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నార‌ని. వీరు త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో కూడా దీనిపై వార్త రావ‌డంతో అంద‌రూ న‌మ్మేశారు.

అయితే ఆ వార్త వ‌చ్చిన‌ప్పుడు నాగార్జున స్విట్జ‌ర్లాండ్‌లో షూటింగ్‌లో ఉన్నాడ‌ట‌. వెంట‌నే చైతుకు ఫోన్ చేసి నాన్న రాత్రి అనుష్క‌తో నీ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది అట క‌దా ? నాకు తెలియ‌దే అన‌డంతో చైతు అవునా డాడీ అని న‌వ్వేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని నాగార్జునే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. ఏదేమైనా ఈ పుకారే ఇప్పుడు స‌మంత‌తో చైతు విడాకులు తీసుకోవ‌డంతో మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌స్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news