Movies"పుష్ప" నుండి మరో క్రేజీ అప్డేట్.. రెడీగా ఉండండి సామీ..!!

“పుష్ప” నుండి మరో క్రేజీ అప్డేట్.. రెడీగా ఉండండి సామీ..!!

లెక్కల మాస్టర్ సుకుమార్‌.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పతికే ఈ కాంబినేషన్ లో వచ్చిన రెండూ సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అయితే ముచ్చటగా మూడోసారి ఈ కేజీ కాంబో రాబోతున్న సినిమా “పుష్ప”.డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇప్పతీకే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్, పాటలు అభిమాబులను భారీ అంచనాలు పెట్టుకునేలా చేసాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడడంతో సుకుమార్ ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో భాగంగా ఈ సినిమా నుంది మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఇప్పతికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు దాక్కో దాక్కో మేక మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకోగా, ఇటీవలే చూపే బంగారమాయేనే శ్రీవల్లీ అనే లిరికల్​ సాంగ్​ను విడుదల చేశారు. సామి సామి పాటకు కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఇప్పుడు ఈ సినిమాలోని నాలుగో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ‌’అంటూ సాగే ఈ పాట న‌వంబ‌ర్ 19న‌ విడుద‌ల చేయ‌బోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే అందులో బ‌న్నీ గుబురు గ‌డ్డం, పొడ‌వైన జుట్టుతో ఎర్ర‌టి నిలువు బొట్టు పెట్టుకుని సోఫాలో స్టైల్‌గా కూర్చున్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది మరి ఇన్ని అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news