Moviesటాలీవుడ్‌లో మ‌రో బిగ్ బ్రేక‌ప్‌... విడాకుల‌కు రెడీ...!

టాలీవుడ్‌లో మ‌రో బిగ్ బ్రేక‌ప్‌… విడాకుల‌కు రెడీ…!

కేవ‌లం సినిమాల్లో మాత్ర‌మే కాదు.. ఆధునిక స‌మాజాంలో వైవాహిక జీవితాలు అంత స‌జావుగా ఉండ‌డం లేదు. చిన్న చిన్న విష‌యాల‌కే దంప‌తుల మ‌ధ్య మాట ప‌ట్టింపులు రావ‌డం.. విడిపోవ‌డం జ‌రుగుతోంది. అయితే ఈ తంతు ఎక్కువుగా ధ‌న‌వంతులు, సెల‌బ్రిటీలు, పారిశ్రామిక వేత్త‌ల కుటుంబాల్లోనే ఎక్కువుగా జ‌రుగుతోంది. చిన్నా చిత‌కా కుటుంబాల్లో ఎవ‌రో ఒక‌రు స‌ర్దుకు పోతూ ఉంటారు. వీరు ఎన్ని గొడ‌వ‌లు ఉన్నా చిన్న కార‌ణాల‌కే విడిపోయేందుకు ఇష్ట‌ప‌డ‌రు. క‌లిసి ఉందామ‌నే అనుకుంటారు.

అయితే పెద్ద కుటుంబాల్లో ఇద్ద‌రిలో ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌రు. త‌మ పంత‌మే నెగ్గాల‌నుకుంటారు. ఈ కార‌ణాలే వారిని విడాకుల వ‌ర‌కు తీసుకు వెళుతున్నాయి. ఇక ఇటీవ‌లే టాలీవుడ్ లో స‌మంత – నాగ‌చైత‌న్య విడాకుల వ్య‌వ‌హారం ఎంత సంచ‌ల‌నం రేపిందో చూశాం. ఇక ఇప్పుడు అదే బాట‌లో మ‌రో టాలీవుడ్ పెద్దింటి జంట కూడా న‌డుస్తోంద‌ట‌.

 

ఈ పెద్ద ఇంటికి చెందిన ఈ జంట‌లో అమ్మాయి గ‌తంలో ఓ విష‌యంలో వార్త‌ల్లోకి వ‌చ్చారు. అయితే ఇప్పుడు ఆ విష‌యం స‌ర్దుమ‌ణ‌గ‌డంతో గ‌డ‌వల్లేవ‌నే అనుకున్నారు. అయితే ఇంత‌లోనే వారి జీవితంలో పెద్ద కుదుపు. ఆ అబ్బాయి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఇక ఇటీవ‌ల వీరి మ‌ధ్య తీవ్ర‌మైన గ్యాప్ వ‌చ్చేసింది.. వారు వేర్వేరుగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news