గత కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే నందమూరితో అల్లు ఫ్యామిలీ బంధం బాగా అల్లుకుంటోన్న వాతావరణమే ఇండస్ట్రీలో కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయమే నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. అల్లు అరవింద్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో బాలయ్యతో ఓ షో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ముందుగానే బన్నీకే వచ్చింది. బన్నీకి ఆ ఆలోచన వచ్చిన వెంటనే బాలయ్యకు ఫోన్ చేయడం.. బాలయ్య ఒక్క నిమిషంలోనే ఓకే చెప్పేయడం వెంటనే జరిగిపోయాయి.
ఈ అన్‌స్టాపబుల్ షోను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య ఇమేజ్‌తో బుల్లితెరను ఎలా షేక్ చేయించవచ్చో ఈ షోతో బాగా ఫ్రూవ్ చేశారు. ఈ షో తర్వాత అల్లు – నందమూరి బంధం స్ట్రాంగ్ అవ్వడంతో ఇండస్ట్రీలో అల్లు, మెగా గ్యాప్ ఏర్పడిందా ? అన్న సందేహం అయితే కొందరిలో వ్యక్తమైంది. అయితే ఇప్పుడు మరో ఫ్యీజులు ఎగిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.
యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న శిల్పాకళావేదికలో జరగనుంది. అఖండపై ఎంతలా భారీ అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ అందించిన మ్యూజిక్కు తోడు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, రోరింగ్, ట్రైలర్లు అయితే చంపేశాయ్. మాస్ ఫ్యాన్స్‌కు మరోసారి బాలయ్య జాతర చూపిస్తున్నాడని తేలిపోయింది.
ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా హాజరవుతున్నాడు అన్నదే ఇప్పుడు అందరిని షేక్ చేస్తోంది. ఒకే వేదికపై బాలయ్య – అల్లు అర్జున్ కనిపిస్తే అంతకన్నా ఆనందం ఏం ఉంటుంది. వీరిద్దరి బంధం రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతూ ఉండడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు అల్లు అభిమానుల్లో సరికొత్త జోష్ వస్తోంది. బన్నీ ఇప్పటికే మెగా కాంపౌండ్‌తో సంబంధం లేకుండా ఓన్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతున్నాడు.
ఈ క్రమంలోనే చాలా తెలివిగా అందరిని దగ్గర చేసుకుంటూ.. అందరికి దగ్గర అవుతున్నాడు. ఇప్పుడు బాలయ్యతో కూడా ఎవ్వరూ ఊహించని విధంగా బలమైన బంధం ఏర్పరుచుకున్నాడు. బాలయ్య సైతం అల్లు రామలింగయ్యతో తమ ఫ్యామిలీకి ఉన్న బంధం గురించి చెప్పి అల్లు ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. ఏదేమైనా ఈ పరిణామాలు చూస్తుంటే బన్నీ మెగా కాంపౌండ్‌తో సంబంధం లేకుండానే తన స్థాయి చూపించుకుంటున్నాడు.