ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే మా ఎనంకల్లో మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ‘మా’ ఎన్నికలు.. అందులో ఓటమిని అంత ఈజీగా ప్రకాష్ రాజ్ మరచిపోయేలా కనిపించడం లేదు. అక్రమాలు, అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. ఆ నిజాలన్నీ జనాలందరికి తెలపాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న ప్రకాష్ రాజ్.. తాజాగా దానికి సంబంధించిన ఆధారాలను ఎన్నికల అధికారికి ఇచ్చారు.
పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో సామాజిక వ్యతిరేకుల ఉనికి ఉందంటూ పదేపదే ప్రశ్నించాం. అలాంటి వారిని కౌంటింగ్ ప్రాంతాలకు అనుమతించారని ఆరోపించాం. కానీ ఆ ఆరోపణలు మీరు ఖండించారంటూ ఈసీ రాసిన లేఖలో పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. క్రిమినల్ రికార్డు వున్న ఓ వైసీపీ నేతను వెంటబెట్టుకుని మోహన్‌బాబు, మంచు విష్ణు పోలింగ్ స్టేషన్లోకి వెళ్లారని.. అందుకు సంబంధించిన ఫొటోలను ఎన్నికల అధికారికి సమర్పించారు. జగన్, మోహన్‌బాబు, మంచు విష్ణుతో వైసీపీ నేత నూకల సాంబశివరావు దిగిన ఫోటోలను ఆధారాలుగా ఇచ్చారు.
ప్రధానంగా ‘మా’ ఎన్నికల్లో రౌడీషీటర్ నూకల సాంబశివరావు పాల్గొన్నారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఇతడిపై జగ్గయ్యపేట పీఎస్ లో రౌడీషీట్ ఉందని..గతంలో ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారనితెలిపారు. అనేక బెదిరింపులు సెటిల్ మెంట్లు కేసులు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల అధికారిగా ‘మా’కి సంబంధం లేని వ్యక్తులను అనుమతించకూడదు. కానీ అవేవీ పట్టించుకున్నట్లు కనిపించట్లేదని లేఖలో ప్రకాష్ రాజ్ ఆరోపించారు.