Moviesవావ్ ' వ‌రుడు కావ‌లెను ' ... ఇంత సూప‌ర్ టాకా...

వావ్ ‘ వ‌రుడు కావ‌లెను ‘ … ఇంత సూప‌ర్ టాకా …!

యంగ్ హీరో నాగ‌శౌర్య – రీతూ వ‌ర్మ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా వ‌రుడు కావ‌లెను. ముర‌ళీశ‌ర్మ‌, న‌దియా, జ‌య‌ప్ర‌కాష్‌, వెన్నెల కిషోర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన ఈ సినిమా ఈ రోజు పాజిటివ్ బ‌జ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమాకు ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చింది.

సింపుల్‌గా ఈ సినిమా క‌థ చూస్తే భూమి ( రీతూవ‌ర్మ‌)కు పెళ్లిపై పెద్ద‌గా ఆస‌క్తి ఉండ‌దు. ఆమె కంపెనీలోరి ఓ ఆర్కిటిక్ ఆకాష్ ( నాగ‌శౌర్య) వ‌స్తాడు. ఆ త‌ర్వాత వారిద్ద‌రికి ఎలా రిలేష‌న్ కుదిరింది ? పెళ్లంటే ఇష్టంలేని భూమి ఆకాష్‌ను ఎందుకు ఇష్ట‌ప‌డుతుంది ? వీరిద్ద‌రికి లింక్ ఎలా కుదిరింది ? అస‌లు క్లైమాక్స్ ఏంట‌నే అంశాల‌తో ఈ సినిమా తెర‌కెక్కింది.

ఈ సినిమాలో చాలా ప్ల‌స్‌లు ఉన్నాయి. రెగ్యుల‌ర్ ల‌వ్‌స్టోరీలా కాకుండా.. రెగ్యుల‌ర్ ఎమోష‌న‌ల్ సీన్ల‌లా కాకుండా చాలా కొత్త‌గా ఉంటుంది. నాగ‌శౌర్య చాలా నీట్‌గా హ్యాండ్‌స‌మ్ లుక్స్‌తో క‌నిపిస్తాడు. ఇక రీతూవ‌ర్మ కూడా చాలా అందంగా క‌న‌ప‌డ‌డంతో పాటు డీసెంట్ యాక్టింగ్ చేసింది. ఆమె లుక్స్ కూడా చాలా బాగున్నాయి. మిడిల్ క్లాస్ తల్లిగా న‌దియా, విల‌న్‌గా హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌తో పాటు స‌ప్త‌గిరి, వెన్నెల కిష‌క్ష‌ర్‌, ప్ర‌వీణ్ చాలా బాగా న‌టించారు.

సినిమాలో ఎమోష‌న్‌, కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. సినిమాలో ఏదైనా నిరాశ ప‌రిచింది అంటే అది కాస్త స్లోగా ఉండ‌డ‌మే..! సెకండాఫ్‌లో క‌థ‌లో కొంత కామెడీ ఇరికించిన‌ట్టుగా ఉంటుంది.

ఫైన‌ల్‌గా..
వ‌రుడు కావ‌లెను రెగ్యులర్ రిలేషన్స్, ఫ్యామిలీ సినిమాల‌కు భిన్నంగా.. కొత్త‌గా ఉంటుంది. ఈ దీపావ‌ళికి ఫ్యామిలీతో స‌హా ఎంజాయ్ చేయొచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news