Moviesస‌మంత చేతిలో మోస‌పోయాడా... అస‌లేం జ‌రిగింది...!

స‌మంత చేతిలో మోస‌పోయాడా… అస‌లేం జ‌రిగింది…!

అక్కినేని నాగ చైతన్య – సమంత జంట వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. సోష‌ల్ మీడియాలో ఒకే పోస్టు షేర్ చేసి తాము విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక‌పై ఇద్ద‌రూ వేర్వేరు మార్గాల్లో ప్ర‌యాణించాల‌ని అనుకుంటున్న‌ట్టు చెప్పారు. వీరి విడాకుల‌పై ప‌లువురు సెల‌బ్రిటీలు ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన‌ట్టుగా స్పందిస్తున్నారు. ఈ విడాకుల వార్త‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే స‌మంత మాజీ ప్రియుడు ( గ‌తంలో వీరిద్ద‌రు ప్రేమించుకున్నార‌న్న వార్త‌లు తెలిసిందే ) సిద్ధార్థ్ సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విడాకుల ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే సిద్ధార్థ్ స్పందిస్తూ తాను స్కూల్ టీచ‌ర్ నుంచి నేర్చుకున్న తొలి పాఠాల‌లో ఇది కూడా ఒక‌టి అంటూ ఒక సూక్తి కోట్ చేశారు. మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు అని సిద్ధార్థ్ రాసుకు వ‌చ్చాడు.

సిద్ధార్థ్ ఈ సందేశం ఎవ‌రిని ఉద్దేశించి అన్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేద‌ని.. చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఈ విష‌యం తెలుసు అని సౌత్ సినీ జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు. గ‌తంలో స‌మంత‌తో అత‌డు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయాడు. అప్ప‌టికే అత‌డికి పెళ్ల‌య్యి ఓ బిడ్డ కూడా ఉన్నారు. అయినా స‌మంత – సిద్ధార్థ్ ఘాటుగా ప్రేమ‌లో మునిగి ఎంజాయ్ చేశారు.

చివ‌ర‌కు స‌మంత అత‌డికి దూర‌మైపోయింది. నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడింది. విచిత్రం ఏంటంటే చైతుతో తొలి సినిమా చేసిన‌ప్ప‌టి నుంచి స్నేహంతో పాటు మ‌రోవైపు ప్రేమ‌లోనూ ఉంది. అదే టైంలో ఇటు సిద్ధార్థ్‌తోనూ ఉంది. మ‌రి సిద్ధూను వ‌దిలి చైతును ఎందుకు పెళ్లి చేసుకుందో…. నాలుగేళ్లు కాపురం చేసి ఇప్పుడు ఎందుకు ? విడిపోయిందో ఆమెకే తెలియాలి. మ‌రి ఈ లెక్క‌న సిద్ధార్థ్ మోస‌పోయాడ‌నే అనుకోవాలా ?

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news