బ్యానర్: ఎక్స్ డోస్ మీడియా బ్యానర్
నటీనటులు: శ్రీరామ్, సంచిత,
మ్యూజిక్: ఏలేంద్ర మహవీర్
నిర్మాతలు: కింగ్ జాన్సన్ కొయ్యాడ, మైనేని నీలిమా చౌదరి
దర్శకత్వం: రాఘవ (ఎన్‌వీఆర్)
రిలీజ్‌డేట్: 22 అక్టోబర్, 2021
ఆరు సంవత్సరాలుగా ప్రొడక్షన్ కంపెనీలో ఉన్న ఎక్సోడస్ మీడియా కంపెనీ తొలిసారిగా నిర్మాణం రంగంలోకి ఎంట్రీ ఇచ్చి నిర్మించిన సినిమా అసలేం జరిగింది. తెలంగాణ గ్రామీణ వాతావరణంలో 1970 – 80 దశకంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కథ అన్న ప్రచారంతో పాటు ట్రైలర్లు, టీజర్లు, పోస్టర్లతో సినిమాపై ఆసక్తి రేకెత్తింది. పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రాఘవ (ఎన్‌వీఆర్) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. కోలీవుడ్ క్రేజీ హీరో శ్రీరామ్, కొత్త అమ్మాయి సంచిత జంటగా నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా థ్రిల్ చేసిందో TL సమీక్షలో చూద్దాం.
కథ & విశ్లేషణ :
హీరో, హీరోయిన్ల మధ్య నడిచే ప్రేమకథకు తోడు అతీంద్రయ శక్తులు, మంత్రగాడు లాంటి హర్రర్ అంశాలు మిక్స్ అయ్యి ఈ సినిమా కథ నడుస్తుంది. తెలంగాణ పల్లెలో నలభై ఏళ్ల క్రితం జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించామని చెప్పారు. నిజంగా ఆ నాడు పల్లెల్లో ఉన్న మూడ నమ్మకాలు, మంత్రగాడు లాంటి అంశాలు ఎలా ఉండేవో అలాగే తెరకెక్కించారు. ఓ అందమైన ప్రేమ కథకు హర్రర్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు రాఘవ ఆద్యంతం ఉత్కంఠతో సినిమాను ప్రజెంట్ చేశారు.
అమావాస్య నాడు ఆ పల్లెటూరికి ఏదో ఉపద్రవం వచ్చేసి అందరూ నాశనం అవుతారన్న పుకార్లు బయలు దేరతాయి. అదే సమయంలో ఊళ్లో వ్యక్తులు కారణం లేకుండానే సడెన్‌గా చనిపోతూ ఉంటారు. భయంతో గ్రామస్తులు ఆ ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు. హీరోయిన్ సంచిత కూడా ఊళ్లో ఉంటే చనిపోతామన్న భయంతో ఊరు ఖాళీ చేసి వెళ్లిపోదామని ఏడుస్తూ హీరోను ప్రాధయే పడుతుంది. హీరో చివరకు ఈ ఊరికి పట్టిన ఆ అతీత శక్తిని ఎలా వదిలించాడు ? మాంత్రికుడి వలలో చిక్కుకున్న తన హీరోయిన్‌ను ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ సినిమా కథాంశం.
హీరో శ్రీరామ్ ఇంత వయస్సు వచ్చినా కూడా ఇంకా యంగ్ గానే ఉన్నాడు. ఈ తరం యువతకు కూడా శ్రీరామ్ బాగా కనెక్ట్ అయ్యాడు. హీరోయిన్ సంచిత అందంగా ఉండడంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.
చిన్న సినిమా అయినా కూడా కథపై నమ్మకంతో నిర్మాతలు క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. ప్రతి ఫ్రేమ్ సినిమాకు తగినట్టుగా ఉంది. సినిమాకు మహవీర్ ఎలేందర్ మ్యూజిక్‌కు తోడు చిన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. దర్శకుడు స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో పాటల్లోనూ, రొమాంటిక్ సీన్లలో హీరో, హీరోయిన్లను చాలా బ్యూటిఫుల్‌గా చూపించాడు. హర్రర్ సీన్లలో కెమేరావర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేసి భయపెడతాయి.
ఇక సేతు స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఈ హార్రర్ మూవీకి కలిసిచ్చాయి. సినిమా మొదలు నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విజయ్ ఏసుదాస్, విజయ్ ప్రకాష్, యాజిన్ నిజార్, మాళవిక, రాంకీ, భార్గవి పిళ్లై సాంగ్స్ అదిరిపోయాయి. పాటలు వినడానికికంటే తెరమీద చూసినప్పుడు ఇంకా బాగున్నాయి.
ఫైనల్‌గా…
సూపర్ హర్రర్ థ్రిల్లర్ అసలేం జరిగింది
TL రేటింగ్: 3 / 5