మాస్ హీరో గోపీచంద్ – నయనతార జంటగా.. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరడుగులు బుల్లెట్ సినిమా ఏడేనిమిదేళ్లుగా ఊరించి ఊరించి ఎట్టకేలకు ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు లేవు. అందుకు తగ్గట్టుగానే ఈ బుల్లెట్ పాత పడిపోయిందన్న విమర్శలు మూటకట్టు కుంది. వక్కంతం వంశీ చాలా అవుట్ డేటెడ్ కథను ఇచ్చినా.. దానిని బి. గోపాల్ ఎంత నిలబెట్టే ప్రయత్నం చేసినా అది మూస కమర్షియల్ సినిమాగా మిగిలిపోయింది.
పరమ రొటీన్ కథగా వచ్చిన ఆరడుగులు బుల్లెట్ గోపీచంద్ ఖాతాలో మరో డిజాస్టర్‌గా నిలిచేలా ఉంది. అయితే ఈ సినిమాను ఆరేడేళ్ల క్రితం రిలీజ్ చేసినా అప్పుడు కూడా ప్రేక్షకులు చూసే వారు కాదని సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే అప్పటికే అవుట్ డేటెడ్ అయిన కథతో ఈ సినిమా తెరకెక్కిందని అంటున్నారు. అయితే ఆరడుగులు బుల్లెట్‌కు ముందుగా అనుకున్న టైటిల్ జగన్మోహన్ ఐపీఎస్.
ఇక తమిళ దర్శకుడు భూపతి పాండ్యన్ ఈ సినిమాకు దర్శకుడు. ఆయన సగం సినిమా తెరకెక్కించాక.. మేకర్స్‌కు, దర్శకుడికిఇ మధ్య ఏదో గ్యాప్ రావడంతో ఆయన తప్పుకున్నాడు. ఇక మిగిలిన సినిమా బి. గోపాల్ పూర్తి చేశారు. అది అరడుగులు బుల్లెట్ అసలు కథ. నయనతార హీరోయిన్‌గా, గోపీచంద్ తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించారు.