మెగా మేనళ్లుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సాయితేజ్. వైవీఎస్. చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ సినిమాతో నటుడు అయినా పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో హిట్ కొట్టాడు. తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ – సుప్రీమ్ – సోలో బ్రతుకే సో బెటర్ లాంటి సినిమాలు సాయిని హీరోగా నిలబెట్టాయి. ఇప్పుడిప్పుడే హీరోగా స్టాండ్ అవుతోన్న సాయికి దురదృష్ట వశాత్తు యాక్సిడెంట్ అయ్యింది. శస్త్రచికిత్స తర్వాత సాయి కోలుకుంటున్నాడు. సాయి త్వరలోనే మళ్లీ సినిమా షూటింగ్లతో బిజీ అవుతాడని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఇదిలా ఉంటే సాయితేజ్ కెరీర్లో ఓ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో సాయి తేజ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. చిన్నప్పుడు పక్క బెంచీ అమ్మాయికి సైట్ కొట్టడానికి తాను ఒంగి ఒంగి దొంగ చూపులు చూసేవాడిని అని.. తర్వాత కాలేజ్ డేస్లో ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేదని కూడా చెప్పాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ రిలేషన్ చెడిపోయిందని సాయి తేజ్ చెప్పాడు.
ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చాక తనకు గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్ అంటూ ఎవ్వరూ లేరనే చెప్పాడు. ఇక యాక్సిడెంట్ నుంచి కోలుకున్న సాయితేజ్ రెండు రోజుల క్రితం ట్వీట్ చేయడంతో అభిమానులు కాస్త ఆనందంతో ఉన్నారు. ఇక సాయితేజ్ చిన్నప్పటి లవ్ గురించి చెప్పినా ఇండస్ట్రీలోనూ ఓ హీరోతో ఆయన ప్రేమాయణం నడిపాడన్న వార్తలు అయితే వచ్చాయి. సాయితో ఎక్కువ సినిమాలు చేసిన సదరు హీరోయిన్ – సాయి గురించి అప్పట్లో చాలా గుసగుసలే వినిపించాయి.