కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆల్‌రౌండర్. ఆయన విలన్ వేషాలు వేశాడు. తర్వాత హీరో అయ్యాడు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. ఇక లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై నిర్మాతగా ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. అటు తిరుపతి సమీపంలో విద్యానికేతన్ కాలేజీలు స్థాపించి ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు నిరుపేదలు అయిన వారికి ఉచితంగా చదువు కూడా తమ విద్యాసంస్థల్లో చదువు చెప్పిస్తున్నారు.
ఆ తర్వాత మోహన్‌బాబు రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు. ఇక ముందు టీడీపీలో కొనసాగిన ఆయన ప్రస్థానం ఇప్పుడు వైసీపీతో కొనసాగుతోంది. ఏపీ సీఎం జగన్ కుటుంబంతో మోహన్‌బాబుకు బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఇక మోహన్‌బాబు తనయుడు విష్ణు ప్రస్తుతం మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు.
ఎవరో ఒక ఆర్టిస్ట్ చనిపోతే .. అతడి కుమార్తెను తన కాలేజ్‌లో ఫ్రీ గా చదివించామని.. ఇప్పుడు ఆమె కోలీవుడ్లో పెద్ద హీరోయిన్ అని చెప్పారు. అయితే ఆమె పేరు గుర్తు లేదన్నారు. ఇక ఎన్టీఆర్ ఒకసారి నీకు రాజకీయాలు అంటే ఇష్టమేనా ? అని అడిగారని.. తాను మౌనం వహించానని. తర్వాత ఓ రోజు చెన్నైలో షూటింగ్‌లో ఉంటే.. చంద్రబాబు ఫోన్ చేసి మీకు ఎంపీ టిక్కెట్ కన్‌ఫార్మ్ అయ్యింది.. అర్జెంటుగా హైదరాబాద్ రావాలని చెప్పగా తాను వచ్చి ఎన్టీఆర్‌ను కలిశాననని నాటి సంగతిని గుర్తు చేసుకున్నారు.