అక్కినేని నాగార్జున తన తనయుడు అఖిల్‌ను హీరోను చేసిన ఆరేళ్లకు కాని బ్యాచిలర్ రూపంలో హిట్ ఇవ్వలేదు. అఖిల్ కోసం నాగార్జున తీసుకున్న అతి జాగ్రత్తలు కొంపముంచాయి. ఇక పూరి కొడుకు ఆకాశ్‌ను కూడా మూడేళ్ల క్రితమే మెహబూబా సినిమాతో హీరోను చేశాడు. ఆ సినిమా డిజాస్టర్. లాంగ్ గ్యాప్ తీసుకుని తన శిష్యుడు అనిల్ దర్శకత్వంలో ఇప్పుడు రొమాంటిక్ సినిమా చేయించాడు. పేరుకు మాత్రమే అనిల్ దర్శకుడ.. ఇక్కడ కథ, స్క్రీన్ ప్లే అంతా పూరీదే. ఇంకా చెప్పాలంటే డైరెక్షన్ కూడా పూరీయే చేసినట్టు సినిమా చూస్తేనే అర్థమవుతుంది.
అఖిల్ విషయంలో నాగార్జున అతి జాగ్రత్తలే ఆరేళ్ల వరకు హిట్ ఇవ్వలేదు. ఇప్పుడు పూరికి ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువుగా ఉండడంతో ఆకాశ్ తొలి హిట్ కోసం ఎన్నేళ్లు వెయిట్ చేయాలో చూద్దాం. రొమాంటిక్ కూడా బాక్సాఫీస్ దగ్గర నిలిచే అవకాశాలు కనపడడం లేదు. ఇక రొమాంటిక్ సినిమా అంతా హీరో, హీరోయిన్ల మధ్య కామాన్ని బుసలు కొట్టించేసింది. హీరో, హీరోయిన్‌కు ఫోన్ చేసి నీ బ్యాక్ ఎప్పుడు అయినా చూసుకున్నావా ? మతిపోతోందిగా అంటాడు. ఆమెను చూస్తే చాలు కామంతో బుసలు కొడుతూ ఏదేదో చేసేయాలని తెగ తాపత్రయ పడిపోతూ ఉంటాడు. ఆమె మీద చేతులు వేసి ఏదేదో చేసేస్తూ ఉంటాడు.
హీరోయిన్ ముంబై వెళుతున్నా అంటే ఓ గంటాగి వెళ్లమంటాడు. నేను కూడా వస్తా.. రాత్రంతా నీతో ఉండి.. పొద్దున్న వచ్చేస్తానంటాడు. ఆ టైంలో హీరోయిన్ గోల చేయకపోయినా తర్వాత హీరోయిన్‌కు కూడా హీరోపై ఇలాంటి ఫీలింగ్సే ఉన్నాయని మనకు తర్వాత అర్థమవుతుంది. ఫైనల్‌గా రొమాంటిక్ ఆ బుసలు కొట్టే కామాన్ని ఎంజాయ్ చేయాలనుకునే వారికి మాత్రమే ఓ మోస్తరుగా నచ్చుతుంది.
పూరి ఆరు వరుస ప్లాపుల తర్వాత ఇస్మార్ట్ శంకర్‌తో ఒక్క హిట్ కొట్టాడు. ఫైనల్ గా రొమాంటిక్ పూరి తీసిన రోగ్, నేను నా రాక్షసి స్థాయిలో విసిగించకపోయినా ఓ క్లారిటీ లేని సినిమా..!