చాలా సార్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్య భర్తల మధ్య చిన్న చిన్న విషయాలే పెద్దవి అయ్యి చివరకు అవి విడాకులకు దారి తీస్తుంటాయి. ఇప్పుడు చైతన్య – సమంత మధ్య కూడా అలాంటి చిన్న విషయాలే పెద్దవి అయ్యి చివరకు వారిద్దరి మధ్య పూడ్చలేని అగాధానికి కారణమై వారు విడిపోయేలా చేశాయి. ఇక చైతు – సమంత విషయంలో ఆమె ఇటీవల చేసిన రెండు సినిమాలే ఆమె కొంప కొల్లేరు చేశాయని అంటున్నారు.
వీరిద్దరు విడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని అంటున్నా.. అందులో ప్రధానంగా ఆమె వస్త్రధారణతో పాటు పెళ్లయ్యాక కూడా ఓ హీరో భార్యగా సంప్రదాయంగా ఉండకుండా ఇంకా గ్లామర్‌గా ఉండాలని మరింత హాట్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేయడం.. సినిమాలు, వెబ్ సీరిస్‌లలో అంతే హాట్‌గా కనిపించడం కూడా చైతు, అక్కినేని ఫ్యామిలీ కోపానికి కారణమైంది.
పెళ్లయ్యాక కూడా ఆమె సినిమాల్లో నటించాలనే పట్టుబట్టింది. సరే ఏదో సంప్రదాయ బద్ధమైన పాత్రలు కాకుండా బోల్డ్ పాత్రల్లో నటించేయడం స్టార్ట్ చేసింది. పెళ్లి తరవాత చేసిన సూపర్ డీలక్స్ సినిమా మరియు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లు చూశాక చైతు, నాగ్ కోపం నషాళానికి వెళ్లిపోయిందట. ఈ సీరిస్‌లలో సమంత ప్రైవేట్ పార్ట్‌లను టచ్ చేసే సీన్లతో పాటు ఆమె బెడ్ రూం సీన్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా విడాకులలో ప్రధాన భూమిక పోషించాయంటున్నారు.