తెలుగు పరిశ్రమలో యాంకర్ నుండి సినిమాల్లో అవకాశాలను అందుకున్న వారిలో సురేఖా వాణి ఒకరు. తనకు వచ్చిన ఏ చిన్ని అవకాశాన్ని వదిలిపెట్టని ఆమె అక్క, వదిన పాత్రలతో పాటుగా యువ హీరోల సినిమాల్లో మదర్ రోల్స్ కూడా చేసింది. ఆన్ స్కీన్ ఆమె చేసిన తల్లి, అక్క, వదిన పాత్రలు చూస్తే మన ఇంట్లో మన మనిషిలానే అనిపిస్తుంది. అయితే ఇదంతా ఆమెకి వన్ సైడ్ మాత్రమే మరోవైపు ఏముంది అంటే ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా ట్రెండీగా ఉంటుంది.
ఆమె స్టైలిష్ లుక్.. హాట్ షో చూస్తే సినిమాల్లో కనిపించే సురేఖా వాణి అంటే నమ్మశక్యంగా ఉండదు. ఏది ఏమైనా ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండిటిని తనకు నచ్చినట్టుగా బాలన్స్ చేసుకుంటూ వెళ్తుంది సురేఖావాణి. టీనేజ్ వయసున్న కూతురు ఉన్నా సురేఖా వాణి రెచ్చిపోవడంలో మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.
తాజాగా సురేఖా వాణి చీరకట్టు,మెడలో మంగళసూత్రంతో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. దీంతో పలువురు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సురేఖా వాణి భర్త చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా భర్త చనిపోయాక తాళి బొట్టు తీసేస్తారు. మొన్నటి వరకు కూడా ఆమె నల్లపూసలు వేసుకోనేలేదు. కాని రీసెంట్గా సురేఖా వాణి మెడలో మంగళసూత్రం కనిపించే సరికి..ఆమె సీక్రేట్ గా రెండో పెళ్లి చేసుకుందా అనే అనుమానలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఆమె షూటింగ్లో భాగంగా వేసుకొని ఉంటుందేమో అని అంటున్నారు.