యువరత్న నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా చరిత్రలో నందమూరి తారక రామారావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఈ రోజు సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. బాలయ్య తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో నటించినా ఏ హీరోయిన్ విషయంలోనూ ఆయనపై వార్తలు రాలేదు. బాలయ్య సినిమా షూటింగ్, సెట్స్‌లో ఎవ్వరికి .. ముఖ్యంగా హీరోయిన్లకు అంత చనువు ఇవ్వరని అంటారు. షూటింగ్ విషయంలో ఆయన చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటారు.
బాలయ్య కెరీర్ స్టార్టింగ్‌లో ఓ హీరోయిన్‌తో చాలా సన్నిహితంగా ఉండేవారన్న టాక్ అప్పట్లో వినిపించింది. ఆ హీరోయిన్ బాలయ్యను ప్రేమించిందని.. బాలయ్యను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుందని అప్పట్లో పెద్ద టాక్. ఆమె ఎవరో కాదు కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ. ఖష్బూ – బాలయ్య సాన్నిహిత్యం విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆఘమేఘాల మీద బాలయ్యకు పెళ్లి చేసేయాలని డిసైడ్ అయ్యారట.
ఎన్టీఆర్‌కు సినిమా అమ్మాయిలను కోడళ్లుగా తెచ్చుకోవడం ఇష్టం ఉండదట. సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంటే కొడుకును సరిగా పట్టించుకోరన్న భయం ఉండేదట. అందుకే వెంటనే కాకినాడకు చెందిన తెలిసిన వాళ్లతో మాట్లాడి వసుంధరతో బాలయ్య పెళ్లి నిశ్చయించేశారట. ఈ పెళ్లి సంబంధం ఖాయం చేసే బాధ్యతను ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు అప్పగించారట. ఇక వసుంధర ఎవరో కాదు ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్ సంస్థల అధినేత ఎస్ఆర్ఎంటీ చౌదరి అన్న కుమార్తె.