శేఖర్ కమ్ముల..టాలీవుడ్ ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు అంటూ సినీ ఇండస్ట్రీలో పిలుస్తుంటారు. శేఖర్ కమ్ముల ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అతడు తీసిన సినిమాలు చాల తక్కువ. ఆలస్యంగా వచ్చినా ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి.శేఖర్ కమ్ముల సినీ ఇండస్ట్రీ లో దశాబ్దం పైగానే కుటుంబ కథా చిత్రాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్న ఏకైక డైరెక్టర్.
రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్ట్ హిట్ అందుకున్నరు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో ఇది వరుకు ఎన్నడూ చూడని సాయి పల్లవి, నాగ చైతన్య లని మనకు చూపించాడు డైరెకటర్. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్వరలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఓ త్రిభాషా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ కాంబినేషన్ తోనే సినిమా పై భారీ అంచనాలు పెంచేసారు డైరెక్టర్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అది ఏమిటంటే.. ఈ సినిమాలో హీరో ధనుష్ పాత్ర చాలా క్లాస్‌గా ఉంటుందట. పెద్దగా ఫైట్స్ ఉండవు, మాస్ సన్నివేశాలు ఉండవు, చాలా సాఫ్ట్‌గా వెళ్లిపోతుందట స్టోరీ.. నిజానికి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో హీరోలని చాలా క్లాస్ గా ఉండేలానే చూయిస్తారు. అయితే హీరో ధనుష్ ఇప్పటివరకూ చేసిన సినిమాలు అన్ని కూడా వేషధారణ, స్టైల్, యాక్షన్ సన్నివేశాలు.. ఇలా అన్నిటిలోమాస్ ఫ్లేవరే ఎక్కువగా కనిపిస్తోంది. సాఫ్ట్ పాత్రను డిజైన్ చేసిన శేఖర్ కమ్ములతో ధనుష్ విబేధిస్తున్నారట. తమిళ ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఆయన పాత్రను డిజైన్ చేయాలని ధనుష్ కోరారట. దీంతో శేఖర్ కమ్ముల ధనుష్ అడిగిన దానికి ఓకే చెప్పలేక, నో చెప్పలేక ..సేఖర్ కమ్ముల ఇబ్బంది పడుతున్నారట. మరి చూడాలి ఈ ఫీల్ గుడ్ డైరెక్టర్ ఏం చేస్తాడో..??