టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత పెళ్లి తరువాత డిఫరెంట్ క్యారెక్టర్లను ఎన్నుకుంటూ సినిమాలు చేసింది. ఈ క్రమంలో వరుస విజయాలను అందుకుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ తన భర్త నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించింది. టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ అని పేరు తెచ్చుకున్న సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మేం విడిపోతున్నాం..కానీ మంచి ఫ్రెండ్స్ గా ఉంటాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.దీంతో వీరిద్దరి విడాకుల వ్యవహారం ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ సమయంలో సమంతపై దారుణమైన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమెని ట్రోల్ చేశారు. వీటన్నింటికీ సమంత గట్టి సమాధానమిచ్చింది. ఇలాంటివేవీ తనను బ్రేక్ చేయలేవని బలంగా చెప్పింది.
ఇక సమంత తన విడాకుల విషయం నుండి బయటపడటానికి వరుస సినిమాలను సైన్ చేస్తూ..బిజీ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటుందట. ఇప్పటికే తెలుగులో ఓ సినిమా సైన్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఇదిలా ఉంటే దసరా సందర్భంగా అంటే అక్టోబర్ 15న సమంత తన కెరీర్‌కు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమా చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రంలో సమంత నటించారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్.