చైతు – సమంత విడిపోయారు. వీరు విడిపోవడానికి అసలు కారణం ఏంటన్నది వారిద్దరికే తెలుసు. అయితే ఎవరికి వారు రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ.. యూట్యూబ్‌లలో, వెబ్ సైట్లలో వస్తోన్న వార్తలకు అంతూ పంతూ లేదు. కొందరు అమల కారణమని.. మరి కొందరు అక్కినేని ఫ్యామిలీ కారణమని.. మరి కొందరు సమంత ఇగోయిస్ట్ అని చెపుతున్నారు. అయితే సడెన్‌గా ఇందులోకి సమంత పర్సనల్ స్టైలీస్ట్ ప్రీతమ్ జుకల్కర్ పేరు కూడా వచ్చింది.
అతడితో ఆమె ప్రేమలో ఉందని.. వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకునే క్రమంలోనే ఆమె చైతుకు విడాకులు ఇచ్చిందని చెప్పారు. గతంలో సామ్ ప్రీతమ్ ఒళ్లో కాలు పెట్టిన ఫొటోను కూడా కొందరు ఉదాహరించారు. అయితే ఈ వార్తలపై ప్రీతమ్ పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే అబద్ధాలు, రహస్యాలనేవి అనుబంధాలను నాశనం చేస్తాయని అతడు రాసుకొచ్చాడు.
సమాజంలో పేరున్న వాళ్లకు ట్రోలింగ్‌ల రూపంలో ఎంతో మానసిక వేదన ఉంటుందని కూడా పేర్కొన్నాడు. అయితే ఈ పోస్ట్ పెట్టిన వెంటనే ప్రీతమ్ దానిని డిలీట్ చేసేశాడు. అంతకు ముందు కూడా అతడు కాస్త అభ్యంతరకరంగా ఉన్న పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడు. ఇక సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ సైతం బుక్ కవర్‌ను చూసి బుక్‌ను జడ్జ్ చేయవద్దని పోస్ట్ పెట్టింది.