అక్కినేని హీరో నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సమంత ఆ బాధలో ఉంది. అయితే ఇప్పుడు ఆమెకు మరిన్ని కష్టాలు వెంటాడనున్నాయి. చైతు – సామ్ జంట కేవలం సౌత్‌లోనే కాదు ఇండియా వైడ్‌గా మోస్ట్ రొమాంటిక్ కఫుల్‌గా పేరు తెచ్చుకున్నారు. పెళ్లికి ముందు ఆమె ఎంత స్టార్ హీరోయిన్గా ఉన్నప్పటకీ పెళ్లయ్యాక కూడా ఆమెకు అవకాశాలు రావడం వెనక చైతు సపోర్ట్‌తో పాటు ఆమె అక్కినేని కోడలు అన్న ఇమేజ్ కూడా ఎంతో కొంత హెల్ప్ అయ్యింది. పైగా చైతు లాంటి క్రేజీ, రొమాంటిక్ హీరోకు భార్య అన్నది కూడా ఆమెకు ఎంతో ప్లస్ అయ్యేది.
బయట చైతుతో కలిసి వచ్చినప్పుడు సమంత పూర్తిగా చైతునూ డామినేట్ చేస్తూ ఫొటోల్లోనూ, పబ్లిక్‌లోనూ.. ఇక పార్టీల్లోనూ తానే హైలెట్ అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేసేది. అయినా కూడా చైతు సామ్ డామినేషన్ చూసి నవ్వుకునేవాడే కాని ఏనాడు తన భర్తను .. తానే ముందుండాలని తాపత్రయ పడేవాడు కాదు. అంతెందుకు ఇటీవల ఫ్యామిలీ మాన్ – 2 వెబ్ సీరిస్‌లో ఆమె చాలా బోల్డ్‌గా చేసింది. ఇది చూసిన ఏ భర్త అయినా తట్టుకుంటాడా ? అన్నది ఆలోచిస్తే ఖచ్చితంగా ఇలాంటివి ఎవ్వరూ కూడా ఎంకరేజ్ చేయరు.
ఇక సమంత విడాకుల ఎఫెక్ట్ ఆమె కెరీర్‌తో పాటు ఆమె నటించిన సినిమాలపై కూడా గట్టిగా పడినట్టు తెలుస్తోంది. ఆమె నయనతారతో కలిసి విఘ్నేష్ శివన్ దర్శకత్వలో కథు వాకుల రెండు కాదల్ సినిమా చేస్తోంది. ఇప్పుడు చైతుతో విడాకులు తీసుకోవడంతో ఈ సినిమాకు మార్కెట్ పడిపోయిందంటున్నారు. చివరకు దీనిని ఓటీటీలో రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా వస్తోంది.
ఇక గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటిస్తోన్న శాకుంతలంపై కూడా ఈ ప్రభావం గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ఇక ఆమె బయట చేసే షోలకు కూడా ఇప్పుడు గతంలో ఉన్నంత డిమాండ్ అయితే ఉండదనే అంటున్నారు.