కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. కేవలం 46 సంవత్సరాల వయస్సులోనే జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండె పోటు రావడంతో హాస్పటల్లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మృతి చెందారు. కన్నడ జనాలు పునీత్‌ను ముద్దుగా అప్పు, కన్నడ పవర్‌స్టార్ అని పిలుచు కుంటూ ఉంటారు.
పునీత్ ఇటీవలే యువరత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. ఆయన నటిస్తోన్న మరో రెండు సినిమాలు కూడా షూటింగ్లో ఉన్నాయి. ఆయన నటిస్తోన్న తాజా థ్రిల్లర్ ద్విత సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక పునీత్ మృతి పట్ల పలు సినిమా ఇండస్ట్రీలకు చెందిన వారంతా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యువరత్న నందమూరి బాలకృష్ణ సైతం ఓ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేస్తూ పునీత్ మృతికి సంతాపం తెలిపారు. ఆ వీడియోలో ఓ సినిమా ఫంక్షన్లో బాలయ్య , పునీత్, యశ్ కూర్చుని ఉన్నారు.
బాలయ్య బొట్టు పెట్టుకుని ఉన్నారు. ఆ నుదుటన ఉన్న బొట్టు ఆయన వేసుకున్న కోట్ మీద పడడంతో పునీత్ దానిని స్వయంగా తన హ్యాండ్ ఖర్పీఫ్తో తుడిచారు. పునీత్ తనపై చూపించిన ప్రేమకు బాలయ్య ఎంతో పొంగిపోయారు. ఇప్పుడు ఇదే వీడియోను బాలయ్య షేర్ చేసి పునీత్‌కు సంతాపం తెలిపారు.
May his soul REST IN PEACE 🙏#RIPPuneethRajkumar pic.twitter.com/x7AYHVqBl0
— Balayya Trends (@NBKTrends) October 29, 2021