ప్రీతమ్ జుకల్కర్..గత కొన్ని రోజుల నుండి ఈ పేరు మీడియాలో హాట్ టాపిక్ గా మారుమ్రోగిపోతుంది. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం తరువాత.. ఇప్పుడు ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు కారణమైంది. విడాకులకు చాలా కారణాలు ఉన్నాయంటున్నా అందులో సమంత పర్సనల్ స్టైలీష్ట్ ప్రీతమ్ జుకల్కర్ కూడా ఒకరని.. అతడితో సమంత స్నేహంగా ఉండడం.. పైగా సమంత బర్త్ డే రోజు తన కాళ్లు అతడి ఒళ్లో పెట్టుకుని పడుకున్న ఫొటోలు పోస్ట్ చేయడంతో రకరకాల సందేహాలు వస్తున్నాయి. విడాకులు ఇచ్చాక అవి ఇప్పుడు మరింత ఎక్కువ అయ్యాయి.
ఇక ఆ వార్తలు పై ప్రీతమ్ జుకల్కర్ స్పందిస్తూ.. సమంత నాకు అక్కలాంటిది అని.. మీడియాలో ఇన్ని తప్పుడు మాటలు వస్తున్న నాగ చైతన్య మౌనంగా ఉండడం బాధేస్తుందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈఅయన మళ్లీ మీడియాలొ హాట్ టాపిక్ గా మారాడు. ఈసారి ఈయన బన్నీ భార్య పై సంచలన కామెంట్స్ చేసాడు.
ప్రీతమ్కు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డితో మంచి స్నేహబంధమే ఉన్నట్టు తాజా పోస్ట్ బట్టి కనిపిస్తోంది. ప్రస్తుతం స్నేహారెడ్డి బన్నీ, అర్హ, అయాన్లు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రీతమ్ తన స్టేటస్ లో ఈ సారి అల్లు స్నేహా రెడ్డి ని ట్యాగ్ చేస్తూ.. తన ఇన్స్టా స్టేటస్ లో ఓ ఫోటో ను పెట్టారు. రీసెంట్ గా హెయిర్ స్టైలిస్ట్ దగ్గరకు వెళ్లిన ప్రీతమ్ అక్కడ హెయిర్ కట్ చేయించుకుంటున్న ఫోటో తీసి.. స్టేటస్ లో పెట్టి అల్లు స్నేహా ను ట్యాగ్ చేసారు. “నువ్వు కూడా రెడీ నా..?” అంటూ అల్లు స్నేహా ను ట్యాగ్ చేసారు. అయితే.. ఉన్నట్లుండి అల్లు స్నేహాను ఎందుకు ట్యాగ్ చేసారా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. అయితే స్నేహారెడ్డి మాత్రం ఇంకా రిప్లై ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.