Moviesప్ర‌కాష్‌రాజ్ మొద‌టి భార్య ఆ తెలుగు హీరో భార్య‌కు చెల్లే..!

ప్ర‌కాష్‌రాజ్ మొద‌టి భార్య ఆ తెలుగు హీరో భార్య‌కు చెల్లే..!

సౌత్ ఇండియా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఇటీవ‌లే మా ఎన్నిక‌ల్లో పోటీ చేసి పెద్ద సంచ‌ల‌నంతో వార్త‌ల్లోకి ఎక్కారు. ముఖ్యంగా ఆయ‌న చుట్టూ లోక‌ల్‌, నాన్ లోక‌ల్ వివాదం బాగా దుమారం రేపింది. ఇదిలా ఉంటే ప్ర‌కాష్‌రాజ్ వ్యక్తిగ‌త జీవితానికి వ‌స్తే ముందుగా మ‌నోడు ల‌లిత కుమారి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. త‌ర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి బాలీవుడ్ డ్యాన్స‌ర్ పోనీ వ‌ర్మ‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్ర‌కాష్‌రాజ్ – ల‌లిత దంప‌తుల‌కు ఇద్ద‌రు అమ్మాయిలు, ఓ కుమారుడు పుట్టారు. అయితే కుమారుడు ప్ర‌మాద వ‌శాద్తు చనిపోయాడు.

అప్ప‌టి నుంచే ప్ర‌కాష్‌రాజ్‌కు ల‌లిత కుమారికి మ‌ధ్య గ్యాప్ రావ‌డంతో వీరు విడాకులు తీసుకున్నారు.
2009వ సంవత్సరంలో ప్రకాష్ రాజ్- లలిత కుమారికి విడాకులు ఇచ్చాడు. అయితే ఇప్ప‌ట‌కీ పెద్ద భార్య పిల్ల‌ల సంర‌క్ష‌ణ ప్ర‌కాష్‌రాజ్ తీసుకున్నాడు. ఇంత‌కు ల‌లిత కుమారి ఎవ‌రో కాదు దివంగ‌త రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి భార్య డిస్కో శాంతికి స్వ‌యానా చెల్లి. వీరి విడాకుల విష‌యంలో శ్రీహ‌రి క‌లుగ జేసుకుని స‌ర్ది చెప్పేందుకు విఫ‌ల ప్ర‌య‌త్నాలు చేశాడ‌ట‌.

ఇక ప్ర‌కాష్‌రాజ్ రెండో భార్య పోని వ‌ర్మ బాలీవుడ్ డ్యాన్స్ మాస్ట‌ర్‌. ఆమె తెలుగులో అలా మొదలైంది – ఇదీ సంగతి – సూపర్ సినిమాల‌కు డాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news