మా ఎన్నికల్లో సినిమా బిడ్డలం నినాదంతో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. మా అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. అయితే ఈ రోజు ఆయన ఫ్యానెల్ నుంచి గెలిచిన 11 మంది కూడా తమ పదవులకు రాజీనామాలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పదవులకు రాజీనామాలు చేసిన ఒక్కొక్కరు మాట్లాడారు.
నటుడు సమీర్ మాట్లాడుతూ పోలింగ్ రోజున మనోజ్ లేకపోతే పెద్ద యుద్ధమే జరిగేదని.. మనోజ్ రెండు ఫ్యానెల్స్కు చెందిన వారిని ఎంతో సముదాయపరుస్తూ అందరిని కంట్రోల్ చేశాడని మెచ్చుకున్నాడు. అయితే మోహన్‌బాబు ఒక్కొక్కరిపై అరుస్తూ , కేకలు వేస్తూ బూతులు తిట్టినా కూడా మనోజ్ సంయమనంతోనే పెద్ద గొడవ తప్పిందన్నాడు.
ఈ క్రమంలోనే సమీర్ తనకు శివబాలాజీకి మధ్య బయట జరిగిన గొడవ గురించి ఆవేశంగా మాట్లాడుతూ ఉండగా స్పీడ్‌లో ఆయన చేయి పక్కనే ఉన్న యాంకర్ అనసూయ కంట్లో పొడుచు కుంది. దీంతో సమీర్ వెంటనే ఆమెకు సారీ చెప్పి తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశాడు.