పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా రంగంలో ఎంతస్టార్ హీరో అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఏడు వరుస హిట్లతో ఖుషీ వరకు ప్లాప్ అన్న పదమే ఎరుగలేదు. అప్పటి నుంచి పవన్ కెరీర్ ఊహించని విధంగా మారింది. ఇటు సినిమాల్లో స్టార్ హీరో అవ్వడంతో పాటు 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీతో పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు.
అంతకుముందే 2009లో అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యూత్ వింగ్ యువరాజ్యంకు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఇక గత ఎన్నికలలో ఏపీలో జరిగిన ఎన్నికలలో జనసేన పోటీ చేసి ఓడిపోయినా పవన్ ప్రభావం మాత్రం రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన తన ఓటు బ్యాంకు బాగా పెంచుకుంది. ఇక ఇప్పుడు పవన్ రాజకీయ విమర్శలకు కూడా కేంద్ర బిందువు అవుతున్నారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య వివాదంలో పలువురు వైసీపీ నేతలు, సానుభూతిపరులు పవన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీనటుడు పోసాని కృష్ణమురళీ పవన్ రెమ్యునరేషన్ గుట్టు రట్టు చేశారు. పవన్ ఒక్కో సినిమాకు రు. 50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటాడని ఆయన చెప్పారు. పవన్ తాను ఒక్కో సినిమాకు రు. 10 కోట్లు తీసుకుంటున్నట్ట అబద్ధం చెపుతున్నాడని బాంబు పేల్చారు.
తాను పవన్‌కు ఒక్కో సినిమాకు రు. 15 కోట్లు ఇస్తానని.. వరుసగా నాలుగు సినిమాలు తనకు చేసిపెడతావా ? అని ప్రశ్నించారు. పోసాని మాటలకు కాస్త అటూ ఇటూగానే పవన్ ఒక్కో సినిమాకు రు. 50 నుంచి రు. 55 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడని ఇండస్ట్రీ వర్గాల టాక్ ?